News October 11, 2025
WBలో మరో MBBS విద్యార్థినిపై అత్యాచారం

బెంగాల్‌లో మరో మెడికల్ స్టూడెంట్ రేప్‌కు గురైంది. ఒడిశాకు చెందిన ఆమె శోభాపూర్ కాలేజీలో చదువుతోంది. మిత్రుడితో కలిసి నిన్న 8.30PMకు తినేందుకు బయటకు వెళ్తుండగా క్యాంపస్ గేటు వద్ద ఓ వ్యక్తి పక్కకు లాక్కెళ్లి రేప్ చేశాడు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. డాక్టర్‌గా చూడాలని ఎన్నో ఆశలతో కుమార్తెను చదివిస్తున్నామని ఆమె తండ్రి రోదించారు. కోల్‌కతా ఆర్జీకర్ రేప్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు రేగడం తెలిసిందే.
Similar News
News October 11, 2025
175 వద్ద రనౌట్.. జైస్వాల్ ఏమన్నారంటే?

WIతో జరుగుతున్న 2వ టెస్టులో 175 రన్స్ వద్ద ఔటవ్వడంపై జైస్వాల్ స్పందించారు. ఇది ఆటలో భాగమేనని తెలిపారు. తానెప్పుడూ లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ గేమ్‌ను వీలైనంత ముందుకు తీసుకెళ్లడానికి ట్రై చేస్తానన్నారు. బంతి మూవ్ అయిన టైంలో గంటసేపు క్రీజులో ఉండగలిగితే ఈజీగా రన్స్ చేయగలనని అనుకున్నట్లు వివరించారు. ఇప్పటికీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారన్నారు.
News October 11, 2025
నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు

AP: CM CBN సతీమణి, NTR ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కి ఎంపికయ్యారు. అపార వ్యాపార నాయకత్వం, వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను IOD ఈ అవార్డు ప్రకటించింది. లండన్లో నవంబర్ 4న జరిగే గ్లోబల్ కన్వెన్షన్లో ఈ అవార్డును ఆమె స్వీకరించనున్నారు. గతంలో ఏపీజే అబ్దుల్ కలాం, రాజశ్రీ బిర్లా, సంజీవ్ గోయెంకా వంటి ప్రముఖులు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
News October 11, 2025
ఇతిహాసాలు క్విజ్ – 32 సమాధానాలు

1. రావణుడి రెండో భార్య ‘ధాన్యమాలిని’.
2. ద్రౌపది అన్న ధృష్టద్యుమ్నుడు.
3. అయ్యప్ప స్వామి వాహనం ‘పెద్ద పులి’.
4. విష్ణుమూర్తి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించాడు.
5. అహం అనే సంస్కృత పదానికి తెలుగు అర్థం ‘నేను’.
<<-se>>#Ithihasaluquiz<<>>