News August 26, 2025
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మరో క్యాంపస్

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ HYDలో మరో భారీ క్యాంపస్ ఏర్పాటు చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని సెంటారస్ బిల్డింగ్‌లో 3,4 అంతస్తుల్లో 2.65 లక్షల చ.అడుగుల స్పేస్‌ను లీజుకు తీసుకుంది. దీనికి రూ.1.77Cr అద్దె, నిర్వహణ వ్యయాలు, ఇతర ఛార్జీలు కలిపి నెలకు రూ.5.4Cr చెల్లిస్తోంది. HYDలోని ఆఫీస్ స్పేస్ మార్కెట్లో అతిపెద్ద లీజు ఒప్పందాల్లో ఇదొకటి. మైక్రోసాఫ్ట్‌కు ఇప్పటికే గచ్చిబౌలిలో ఆఫీస్ ఉంది.
Similar News
News August 26, 2025
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం: APSDMA

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని APSDMA పేర్కొంది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News August 26, 2025
ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు!

TG: ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 5 రోజుల పాటు సమావేశాలు కొనసాగే అవకాశమున్నట్లు సమాచారం.
News August 26, 2025
AP న్యూస్ రౌండప్

* విజయవాడ నగర ప్రజలు 7,730 వినాయక మట్టి ప్రతిమలు తయారు చేసి వరల్డ్ రికార్డు బద్దలుకొట్టారు.
* AP క్యాడర్ IAS అధికారులు లవ్ అగర్వాల్, అనిల్ కుమార్ కేంద్ర సర్వీసుల్లో చేరారు.
* ఆస్పత్రిలో ప్రియురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోపై వివరణ ఇవ్వాలని రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు నెల్లూరు జైలు సూపరింటెండెంట్ మెమో జారీ చేశారు.
* లిక్కర్ స్కాం కేసులో MP మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు ACB కోర్టులో ప్రవేశపెట్టారు.