News November 23, 2024
రిషభ్ పంత్ ఖాతాలో మరో మైలురాయి
టీమ్ ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఖాతాలో మరో మైలురాయి చేరింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా పంత్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 2,032 పరుగులు చేశారు. 52 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత అందుకోవడం విశేషం. తొలి రెండు స్థానాల్లో రోహిత్ (2,685), కోహ్లీ (2,432) ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ వికెట్ కీపర్‌గానూ పంత్ (661) రికార్డులకెక్కారు.
Similar News
News November 23, 2024
నేడే ఫలితాలు.. WAY2NEWSలో EXCLUSIVEగా..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రియాంకా గాంధీ బరిలో నిలిచిన వయనాడ్ సహా నాందేడ్ ఎంపీ స్థానానికి, వివిధ రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ సీట్ల బైపోల్ రిజల్ట్స్ కూడా వెలువడనున్నాయి. అన్నింటి ఫలితాలను ఎక్స్‌క్లూజివ్‌గా, అందరికంటే ముందుగా, వేగంగా WAY2NEWSలో తెలుసుకోండి. ఎప్పటికప్పుడు రిజల్ట్స్ అప్డేట్స్, అనాలసిస్ స్టోరీస్ అందుబాటులో ఉంటాయి. STAY TUNED.
News November 23, 2024
బడ్జెట్ సమస్యలు.. సూర్య సినిమా నిలిపివేత?
సూర్య హీరోగా తెరకెక్కాల్సిన ‘కర్ణ’ సినిమా తాత్కాలికంగా నిలిచిపోయినట్లు వార్తలొస్తున్నాయి. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా రూ.600కోట్లతో ఈ ప్రాజెక్టును తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. కానీ బడ్జెట్ సమస్యల వల్ల నిలిచిపోయిందని, కొత్త నిర్మాతల వేటలో డైరెక్టర్ ఉన్నట్టు తెలుస్తోంది. మహాభారతం ఆధారంగా రూపొందాల్సిన ఈ మూవీలో ద్రౌపదిగా జాన్వీ కపూర్ నటిస్తారని సమాచారం.
News November 23, 2024
గ్రూప్-2 వాయిదా వేయాలని డిమాండ్
TG: రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16 తేదీల్లో జరగనుండగా, RRB జూ.ఇంజినీర్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అదే నెల 16, 17, 18 తేదీల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. 16న ఒకే రోజు రెండు పరీక్షలు ఉండడంతో, రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు ఏదో ఒక దానిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. RRB దేశవ్యాప్తంగా జరిగే పరీక్ష కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.