News April 2, 2024

దళపతి విజయ్‌ మరొక్క సినిమా!

image

తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించిన దళపతి విజయ్‌కు ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(గోట్) సినిమాయే ఆఖరిది అని వార్తలు వచ్చాయి. అయితే అది పూర్తయ్యాక మరో సినిమా చేస్తున్నానని, అదే తనకు ఆఖరిదని విజయ్ ప్రకటించారు. పూర్తిగా రాజకీయ కోణంలో సాగే ఓ కథను హెచ్ వినోత్ ఆయనకు చెప్పినట్లు సమాచారం. పొలిటికల్ ఎంట్రీకి ఆ కథ కరెక్ట్‌గా ఉంటుందని దళపతి భావించినట్లు తెలుస్తోంది.

Similar News

News January 26, 2026

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: గవర్నర్

image

తెలంగాణ గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవంలో ప్రసంగించారు. ఓటింగ్ ఒక పవిత్రమైన కర్తవ్యమని అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. యువత మొదటిసారి ఓటు వేసే వారిలో అవగాహన పెంపొందించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న కృషిని ప్రశంసించారు.

News January 26, 2026

ప్చ్ శాంసన్.. 9 ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు

image

టీ20Iల్లో ఓపెనర్‌గా సంజూ శాంసన్ ఫెయిల్యూర్ కొనసాగుతోంది. 2025 జూన్ నుంచి 9 ఇన్నింగ్స్‌లలో 104 పరుగులు (Avg 11.55, SR 133.33) మాత్రమే చేశారు. వీటిలో ఒక్కసారి మాత్రమే పవర్ ప్లేలో నాటౌట్‌గా నిలిచారు. ఈ 9 ఇన్నింగ్స్‌ల స్కోర్లు 26(20), 5(7), 3(6), 1(3), 16(7), 37(22), 10(7), 6(5), 0(1)గా ఉన్నాయి. తాజాగా NZ సిరీస్‌లో ఫెయిల్ అవుతుండటంతో తుది జట్టులో ఆయనకు స్థానం దక్కే అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి.

News January 26, 2026

కొత్త సినిమా ప్రకటించిన హీరో నితిన్

image

డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు హీరో నితిన్ ప్రకటించారు. ‘NO BODY NO RULES’ అంటూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మించనున్నారు. ‘తమ్ముడు’ తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఇదే. కాగా VI ఆనంద్ గతంలో ‘టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం, డిస్కో రాజా, ఊరు పేరు భైరవకోన’ సినిమాలను తెరకెక్కించారు. ఈ మూవీ అయినా నితిన్‌కి హిట్ ఇస్తుందేమో చూడాలి.