News April 24, 2024
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

వాట్సాప్‌లో ‘ఫేవరెట్స్’ పేరుతో కొత్త ఫీచర్ రానుంది. యూజర్లు తమ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, గ్రూపులను ఫేవరెట్స్ జాబితాకు యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఆయా కాంటాక్ట్‌ని ఈజీగా కనుగొని స్పీడ్ డయల్‌తో పాటు ఈజీగా మెసేజ్‌లు పంపేందుకు వీలుంటుంది. సెట్టింగ్స్ మెనూలో ఈ ఫేవరెట్ ట్యాబ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో కాంటాక్ట్స్ ఆర్డర్‌ను మార్చుకోవడంతో పాటు తొలగించవచ్చు.
Similar News
News October 17, 2025
తిన్న వెంటనే నడుస్తున్నారా?

భోజనం చేశాక నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తిన్న వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నడిస్తే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని చెబుతున్నారు. భోజనం చేశాక 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే త్వరగా జీర్ణం అవుతుందని, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.
Share it
News October 17, 2025
మంత్రి లోకేశ్‌పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై Xలో TDP, YCP సెటైరికల్ పోస్టులు పెడుతున్నాయి. ‘గూగుల్‌ను సమర్థించలేక, ఎలా విమర్శించాలో అర్థంకాక YCP గుడ్డు బ్యాచ్ గుడ్డు మీద ఈకలు పీకుతోంది’ అంటూ TDP అమర్నాథ్ ఫొటోను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీనిపై YCP స్పందిస్తూ ‘పరిశ్రమల ఏర్పాటుపై అమర్నాథ్ గుక్కతిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పప్పు గుత్తి తిప్పుకుంటున్న నిక్కర్ మంత్రి లోకేశ్’ అని పేర్కొంది.
News October 17, 2025
పిల్లలను స్కూల్‌కు పంపేందుకు ఇంత కష్టపడుతున్నారా?

పిల్లలను తయారుచేసి బడికి పంపే సమయంలో మనం చేసే హడావిడి.. మారథాన్‌లో పరిగెత్తడానికి సమానం అని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియలో తల్లిదండ్రులు 3,000 క్యాలరీల వరకు ఖర్చు చేస్తారని అంచనా వేశారు. పిల్లలను బట్టలు వేసుకోమని బతిమాలడం, అరవడంలో తల్లిదండ్రులు ఖర్చుచేసే శక్తి ‘మారథాన్‌లో పరుగెత్తడం, కోపంగా ఉన్న ఎలుగుబంటితో పోరాడినంత పనే’ అని ప్రొఫెసర్ ఓలాన్ విచ్ వివరించారు. మీరూ ఇలా కష్టపడతారా?