News October 9, 2024

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

image

వాట్సాప్‌లో ‘సెర్చ్ ఇమేజెస్ ఆన్ ది వెబ్’ అనే ఫీచర్ రానుంది. దీనితో చాట్‌లో వచ్చిన ఇమేజెస్‌ను గూగుల్‌లో సెర్చ్ చేయవచ్చు. ఆ ఫొటో నిజమైనదా? ఎడిట్ చేసిందా? ఎక్కడి నుంచి తీసుకున్నారు? వంటి సమాచారం ఈజీగా తెలిసిపోతుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని, ఇది కేవలం ఆప్షనల్ ఫీచర్ అని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది. ప్రస్తుతం ఇది డెవలప్‌మెంట్ దశలో ఉందని తెలిపింది.

Similar News

News December 9, 2025

జగిత్యాల: పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు మాత్రమే సెలవులు

image

జిల్లాలో ఈ నెల 11 నుండి 17 వరకు విడతల వారీగా జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలకు మాత్రమే సెలవులు ఉంటాయని కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10 – 11 వరకు మొదటి విడత, 13 -14 వరకు రెండో విడత, 16-17 వరకు ఎన్నికలు ఉంటాయని, ఆయా గ్రామాల్లోని జరగనున్న ఎన్నికల్లో భాగంగా ఆయా గ్రామాల్ల పోలింగ్ కేంద్రాల్లో 2 రోజులు సెలవులు ఉంటాయని ఉత్తర్వులు పేర్కొన్నారు.

News December 9, 2025

సంజూకు మళ్లీ నిరాశేనా!

image

SAతో వన్డేల్లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు T20ల్లోనూ మొండిచేయి ఎదురయ్యే ఆస్కారముంది. గాయాల నుంచి కోలుకున్న గిల్, పాండ్య జట్టుతో చేరనున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు. దీంతో అభిషేక్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్‌గా జితేశ్‌ను తీసుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11.. సూర్య(C), గిల్(VC), అభిషేక్, తిలక్, పాండ్య, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్, కుల్దీప్

News December 9, 2025

సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే: CM

image

AP: ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. RTGSపై సమీక్షలో మాట్లాడుతూ ‘వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. రిజిస్ట్రేష‌న్ల తర్వాత డాక్యుమెంట్లను నేరుగా ఇళ్లకే పంపించాలి. RTC బ‌స్టాండ్లు, టాయ్‌లెట్ల వ‌ద్ద పరిశుభ్ర‌తను మెరుగుపర్చాలి. రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలి’ అని సూచించారు.