News February 21, 2025
చైనాను వణికిస్తోన్న మరో కొత్త వైరస్?

చైనాను కొవిడ్ మాదిరిగా మరో కొత్త వైరస్ వణికిస్తున్నట్లు సమాచారం. సైంటిస్టులు ‘HKU5-COV-2’ అనే వైరస్‌ను గబ్బిలాల్లో గుర్తించారు. కరోనాలాగే ఇది కూడా జంతువుల నుంచి మానవులకు సంక్రమిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ వైరస్‌ను మెర్బెకో వైరస్‌తోపాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. దీనిని తొలుత హాంకాంగ్‌లోని జపనీస్ పిపిస్ట్రెల్ రకం గబ్బిలాల్లో గుర్తించారు.
Similar News
News January 10, 2026
గ్రీన్‌లాండ్‌పై డెన్మార్క్‌కు ట్రంప్ వార్నింగ్

గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ డెన్మార్క్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘వారికి నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్‌పై మేమో నిర్ణయానికి వచ్చాం. ఈజీగా ఒక డీల్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అది సాధ్యం కాకపోతే కష్టమైన దారిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ పని మేము చేయకపోతే రష్యా, చైనా చేస్తాయి. అందుకు అమెరికా సిద్ధంగా లేదు. ఏదేమైనా గ్రీన్లాండ్ విషయంలో వెనక్కి తగ్గం’ అని స్పష్టం చేశారు.
News January 10, 2026
NHIDCLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News January 10, 2026
జమ్మూ: సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్

జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించడం కలకలం రేపింది. BSF బలగాలు డ్రోన్ కదలికలను గుర్తించాయి. డ్రోన్ ద్వారా పాక్ ఆయుధాలు జార విడిచినట్లు తెలుస్తోంది. ఫ్లోరా గ్రామం వద్ద భద్రతా బలగాలు ఆయుధాలను గుర్తించాయి. 2 పిస్టల్స్, గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నాయి.


