News October 9, 2024
రెండు నెలల్లో మరో నోటిఫికేషన్: భట్టి

TG: విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇది గడీల పాలన కాదని, ప్రజా పాలన అని పేర్కొన్నారు. ఈ నెల 11న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు భూమి పూజలు చేస్తామన్నారు. మరోవైపు మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని ఆయన వెల్లడించారు.
Similar News
News October 15, 2025
ఇక సెలవు.. ఆయుధం వదిలిన ‘అడవిలో అన్న’

మావోయిస్టు పార్టీలో ఓ శకం ముగిసింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి టాప్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ సెలవు పలుకుతూ జనజీవన స్రవంతిలో కలిశారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఆయుధం చేతబట్టారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1993లో DKS జడ్పీ సభ్యుడిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 4 దశాబ్దాల్లో ఎన్నో ఎన్కౌంటర్లకు నాయకత్వం వహించారు.
News October 15, 2025
ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే!

క్రాసులా ఒవాటా అనే శాస్త్రీయ నామం గల ‘జేడ్’ ప్లాంట్ అదృష్టాన్ని, ఆర్థిక శ్రేయస్సును పెంపొందిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. నాణెం ఆకారంలో ఉండే వీటి ఆకులు సంపదకు చిహ్నంగా భావిస్తారు. దీనిని ఆగ్నేయ దిశలో ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెంచి ఒత్తిడి తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శాస్త్రీయంగా ఇది ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్గా పనిచేసి బెంజీన్ వంటి విషపదార్థాలను తొలగిస్తుంది. Share It
News October 15, 2025
జనవరి నాటికి కోటి మందికి భూధార్ కార్డులు

TG: భూధార్ కార్డులను త్వరలోనే అందించనున్నారు. జనవరి నాటికి కోటి మంది రైతులకు భూధార్ అందించేలా రాష్ట్ర రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇచ్చేలా కేంద్రం భూధార్ తీసుకొచ్చింది. సర్వే రికార్డు, RORలోని వివరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలిక భూధార్ కార్డులు ఇచ్చి, రీ సర్వే చేశాక శాశ్వత కార్డులు ఇస్తామని భూభారతి చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.