News February 17, 2025

కులగణన కోసం మరో అవకాశం: పొన్నం

image

TG:కులగణన వివరాల నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని, ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. BCలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తాము సిద్ధమన్నారు. కులగణనలో పాల్గొనని వారు ఈ నెల 28 వరకు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. 040-211 11111 నంబర్‌కు ఫోన్ చేస్తే ఎన్యూమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఆన్‌లైన్‌లోనూ <>https://seeepsurvey.cgg.gov/<<>> ద్వారా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

Similar News

News December 1, 2025

చైనాలో నిరుద్యోగం.. సివిల్స్ పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

image

చైనాలో సివిల్స్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత వయసు 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో ఏకంగా 37 లక్షల మంది పరీక్ష రాశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 70% కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 1, 2025

ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

image

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.