News December 25, 2024

టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం

image

AP: పదో తరగతి విద్యార్థులకు SSC పరీక్షల విభాగం మరో అవకాశం కల్పించింది. వివిధ కారణాలతో మార్చి-2025 పరీక్ష ఫీజు చెల్లించని వారికోసం తత్కాల్ విధానం తీసుకొచ్చింది. ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్‌లో రూ.1000 ఫైన్‌ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కె.శ్రీనివాసులురెడ్డి సూచించారు.

Similar News

News December 25, 2024

జానీ మాస్టర్‌కు మరో షాక్

image

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ కేసులో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు అందులో పేర్కొన్నారు. ఈవెంట్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెను వేధించినట్లు నిర్ధారించారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై బయట ఉన్నారు.

News December 25, 2024

తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ అభినందనలు

image

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘మనం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం’ అని పొన్నం ప్రభాకర్ పేరిట ఆయన లెటర్ రాశారు. ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఇలానే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.

News December 25, 2024

WhatsAppలో అదిరిపోయే ఫీచర్

image

వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ వచ్చింది. ఏదైనా డాక్యుమెంట్‌ను స్కాన్ చేయాలంటే ఇక థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు. నేరుగా వాట్సాప్‌లోనే స్కాన్ చేసి షేర్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ప్రస్తుతం iOS యూజర్లకు ఈ ఫీచర్ రాగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకూ అందుబాటులోకి రానుంది. డాక్యుమెంట్ షేరింగ్ మెనూ ఓపెన్ చేసి, ‘SCAN DOCUMENT’పై క్లిక్ చేస్తే స్కాన్ చేసుకోవచ్చు. బ్లాక్&వైట్ మోడ్, PDF లాంటి ఆప్షన్లు ఉంటాయి.