News September 12, 2024

డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం

image

AP: డిగ్రీలో చేరేందుకు విద్యార్థులకు ఉన్నత విద్యామండలి మరో అవకాశం ఇచ్చింది. ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 15వ తేదీకి పొడిగించింది. 18వ తేదీ వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని, 19న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని పేర్కొంది. 22న సీట్ల కేటాయింపు జరుగుతుందని, 22 నుంచి 25వ తేదీలోగా కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాలని సూచించింది.

Similar News

News November 26, 2025

వేప మందుల వాడకం.. ఇలా అధిక లాభం

image

పంటల్లో వేపనూనె వాడేటప్పుడు సబ్బు ద్రావణం తప్పనిసరిగా వాడాలి. వేపనూనె, ద్రావణాలను సాయంత్రం చల్లితే ఫలితం బాగుంటుంది. ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత వెంటనే పిచికారీ చేయాలి. ఆలస్యం చేయకూడదు. పంటకు హానిచేసే పురుగుల గుడ్డు పొదిగే దశలో వేప మందును చల్లితే లార్వాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చు. బాగా ఎదిగిన లార్వాలు పంటను ఆశిస్తే వేప మందులను నిపుణుల సూచనలతో రసాయన మందులతో కలిపి వాడితే ఫలితాలు బాగుంటాయి.

News November 26, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 13

image

72. స్థితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు?
సమాధానం: మెప్పులైనా, నిందలైనా; చలి, వేడిమి; లాభం, నష్టం; సుఖం, దుఃఖం.. వీటన్నింటిలోనూ సమానంగా ఉంటూ, దేనికీ చలించక, లభించిన దానితోనే సంతోషిస్తూ, అహంకారం లేకుండా, మనసును అదుపులో ఉంచుకునే స్థిరమైన బుద్ధి గలవాడే స్థితప్రజ్ఞుడు. ☛ యక్ష ప్రశ్నలు, సమాధానాలు ఇంతటితో పూర్తయ్యాయి. మొదటి ప్రశ్న నుంచి చూడాలనుకుంటే క్లిక్ చేయండి <<-se>>#YakshPrashnalu<<>>.

News November 26, 2025

సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ పత్రంతో పాటు అభ్యర్థి ఫొటో, క్యాస్ట్, నో డ్యూస్, బర్త్ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ నంబర్ జత చేయాలి. అఫిడవిట్‌లో అభ్యర్థి, ఇద్దరు సాక్షుల సంతకం ఉండాలి. డిపాజిట్ అమౌంట్ (SC, ST, BCలకు రూ.1,000, జనరల్‌కు రూ.2,000) చెల్లించాలి. Expenditure declaration సమర్పించాలి.
*Share It