News October 18, 2025

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

image

AP: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు యాక్ట్‌ను సవరిస్తూ <>గెజిట్<<>> జారీచేసింది. 2019లో BPS ద్వారా 2018 ఆగస్టు వరకు ఉన్న నిర్మాణాల్ని రెగ్యులరైజ్ చేశారు. అయితే తాజాగా 59,041 అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. ఇప్పుడు వీటి క్రమబద్ధీకరణకు కటాఫ్ డేట్‌ను 2025 ఆగస్టు 31గా సవరించారు. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలనే దానిపై ప్రభుత్వం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Similar News

News October 18, 2025

పిశాచ స్థానం పట్ల నిర్లక్ష్యం వద్దు: వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు

image

పిశాచ స్థానాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ విషయం పట్ల అలసత్వం వహిస్తే ఇంట్లో ఉండేవారు ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘ఇంటి చుట్టూరా ప్రహరీకి నడుమ ఉండే ఖాళీ స్థలాన్ని పిశాచ స్థానంగా చెబుతారు. ఇది ఉంటేనే గాలి, వెలుతురు ఇంట్లోకి వస్తాయి. ఇవి ఆ గృహంలో నివసించే వారికి ఉత్తేజాన్ని కలిగిస్తాయి’ అని తెలిపారు.<<-se>>#Vasthu<<>>

News October 18, 2025

టారిఫ్స్‌పై గుడ్‌న్యూస్?.. చర్చలు జరుగుతున్నాయన్న గోయల్

image

భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ చర్చలు స్నేహపూర్వక వాతావరణంలో జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. యూఎస్ టారిఫ్స్‌పై గుడ్‌న్యూస్ వస్తుందా అని మీడియా ప్రశ్నించగా ‘ట్రేడ్ చర్చలు, ఒప్పందాలు డెడ్‌లైన్స్ ఆధారంగా జరగవు. రైతులు, జాలర్లు, MSME రంగ ప్రయోజనాలు కాపాడేవరకు ఎలాంటి అగ్రిమెంట్ పూర్తికాదు. చర్చలు బాగా సాగుతున్నాయి. మేము ఓ నిర్ణయానికి వచ్చాక తెలియజేస్తాం’ అని తెలిపారు.

News October 18, 2025

బుధవారం నుంచి భారీ వర్షాలు: APSDMA

image

AP: మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.