News May 3, 2024

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో మరొకరు అరెస్ట్

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. ట్విటర్(X)లో ‘స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్’ అనే అకౌంట్‌ను హ్యాండిల్ చేస్తున్న అరుణ్ రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టయిన సంగతి తెలిసిందే.

Similar News

News November 28, 2025

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్: కలెక్టర్

image

పార్వతీపురం కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గురువారం తెలిపారు. పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారు, పదవీ విరమణ పొందినవారు తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించవచ్చు అన్నారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ఆదేశించారు.

News November 28, 2025

తూర్పు గోదావరి జిల్లాలో బడి బస్సులపై ప్రత్యేక డ్రైవ్

image

విద్యాసంస్థలకు చెందిన బస్సుల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు డీటీఓ ఆర్. సురేశ్ తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ డ్రైవ్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో 2,000కు పైగా బస్సులను నాలుగు ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తాయని డీటీఓ వివరించారు.