News March 26, 2024

అదానీ గ్రూప్ చేతుల్లోకి మరో పోర్ట్!

image

దేశంలోని తూర్పు, పశ్చిమ తీరాల్లో ఇప్పటికే పలు పోర్టులను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ తాజాగా మరో పోర్టును దక్కించుకోనుంది. రూ.3,080 కోట్లతో ఒడిశాలోని గోపాల్‌పుర్ పోర్టు (GPL) కొనుగోలుకు సిద్ధమైంది. GPLలో ఎస్‌పీ గ్రూప్‌కు ఉన్న 56%, ఒడిశా స్టీవ్‌డోర్స్ లిమిటెడ్‌కు చెందిన 39% వాటాను అదానీ గ్రూప్ కొనుగోలు చేయనుంది. కాగా ప్రస్తుతం పశ్చిమ తీరంలో 7, తూర్పు తీరంలో ఏడు పోర్టులు అదానీ పరిధిలో ఉన్నాయి.

Similar News

News January 22, 2026

NZB: రంజాన్ ఏర్పాట్లపై షబ్బీర్ అలీ సమీక్ష

image

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ముస్లింలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ముఖ్యంగా ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా మసీదుల వద్ద పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్ ఉండాలని, ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.

News January 22, 2026

పెద్దపల్లి: ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యం: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో యువతకు ప్రణాళికాబద్ధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీజీ-ఐపాస్ (TG-iPASS) కింద నూతన పరిశ్రమల ఏర్పాటు, అనుమతులపై సమీక్ష నిర్వహించారు. కొత్త పరిశ్రమల స్థాపన ద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.