News May 1, 2024

‘పుష్ప-2’ నుంచి మరో పోస్టర్

image

హీరో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ నుంచి మేకర్స్ మరో పోస్టర్ విడుదల చేశారు. ఎర్రచందనం దుంగల మధ్య నిలబడ్డ అల్లు అర్జున్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నారు. ఇక ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే పాట ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఈ సాంగ్ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు.

Similar News

News March 3, 2026

చంద్రగ్రహణం.. నేరుగా చూడవచ్చా?

image

మన దేశంలో చంద్రగ్రహణం ఏర్పడింది. మ.3.20 గం.కు ఇది ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలవారు 6.20PM నుంచి చూడొచ్చు. 6.47PMకు గ్రహణం ముగుస్తుంది. చంద్రగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చని, ఎలాంటి ప్రత్యేక గ్లాసెస్ అవసరం లేదని సైంటిస్టులు వెల్లడించారు. సూర్యగ్రహణం మాదిరిగా ఇది ప్రమాదకరం కాదని, చంద్రకిరణాలు ఎలాంటి హాని చేయవని పేర్కొన్నారు.
Share It

News March 3, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 5 అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/BTech (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నేటి నుంచి మార్చి18 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.50,721 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com

News March 3, 2026

అమెరికా భూభాగంపై ఇరాన్ ఎందుకు దాడి చేయట్లేదు?

image

టెహ్రాన్ నుంచి USA తూర్పు తీరం దాదాపు 10వేల KM దూరంలో ఉంది. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు 2,000-2,500 KM మాత్రమే వెళ్తాయి. అందుకే ఇరాన్ అమెరికా భూభాగంపై కాకుండా ఇజ్రాయెల్, గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడి చేస్తోంది. కానీ అమెరికా దగ్గర ఖండాంతర క్షిపణులు (ICBM) ఉన్నాయి. ఇవి 13వేల KM ప్రయాణించగలవు. గంటకు 28వేల KM వేగంతో దూసుకెళ్తాయి. అలాగే B-2, B-52 బాంబర్లు US అమ్ములపొదిలో ఉన్నాయి.