News April 3, 2025
హను రాఘవపూడితో ప్రభాస్ మరో సినిమా?

ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హను డైరెక్షన్ పట్ల ముగ్ధుడైన ప్రభాస్ ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని, కథ రెడీ చేసుకోవాలని సూచించారని సమాచారం. అయితే ఇది తెరకెక్కేందుకు చాలా కాలం పడుతుందని సినీవర్గాలంటున్నాయి. డార్లింగ్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్నారు.
Similar News
News October 20, 2025
ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్లకు ప్రభుత్వం ఉత్తర్వులు

AP: ఆర్టీసీలో నాలుగు క్యాడర్ల ఉద్యోగుల పదోన్నతులకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశంలో చంద్రబాబు హామీ ఇవ్వగా నిన్న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పనిష్మెంట్లు, పెనాల్టీలు, క్రమశిక్షణ చర్యలు వంటివి ఉన్నా వాటితో సంబంధం లేకుండా ప్రమోషన్లకు అర్హులుగా పేర్కొంది. దీంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టిజన్స్ క్యాడర్లోని ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
News October 20, 2025
అనూహ్య ఓటమి.. స్మృతి కంటతడి

WWCలో నిన్న ENGతో జరిగిన కీలక మ్యాచ్లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కంటతడి పెట్టారు. ఛేజింగ్ స్టార్టింగ్లోనే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ హర్మన్(70)తో కలిసి స్మృతి అద్భుత ఇన్నింగ్స్(88)తో కంఫర్టబుల్ పొజిషన్కు తీసుకెళ్లారు. అయినా ఓటమి తప్పకపోవడంతో స్మృతి ఎమోషనల్ అయ్యారు. ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్గా SMలో పోస్టులు పెడుతున్నారు.
News October 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 41

1. దశరథుడి ప్రధాన మంత్రి ఎవరు?
2. నకుల, సహదేవుల తల్లి ఎవరు?
3. విష్ణువు నివాసం ఉండే లోకం పేరు ఏమిటి?
4. ‘పంచాంగం’ అంటే ఎన్ని ముఖ్యమైన అంశాల సమాహారం?
5. ‘అన్నవరం’లో కొలువై ఉన్న దేవుడు ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>