News August 31, 2025
మంత్రి లోకేశ్‌కు మరో అరుదైన గౌరవం

AP: ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్(SVP)లో పాల్గొనాలని మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఢిల్లీలోని AUS హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఈ లేఖను మంత్రికి పంపారు. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో రాష్ట్ర నాయకత్వాన్ని ప్రశంసించారు. SVPలో ఆస్ట్రేలియా విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలతో సమావేశమై అభివృద్ధి ప్రాధాన్యతలు, పెట్టుబడులపై చర్చించే అవకాశం ఉంటుంది.
Similar News
News September 1, 2025
నందీశ్వరుడు ఎవరు?

మహాశివుడి పరమభక్తుడైన శిలాదుడి కుమారుడే నందీశ్వరుడు. ఓసారి అతను శ్రీశైలం వచ్చి కఠోర తపస్సు చేశాడు. నంది దీక్షకు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు మరో 10వేల ఏళ్లు తపస్సు శక్తిని ప్రసాదించమని నంది అర్థించగా శివుడు తథాస్తు అన్నాడు. 10వేల వేళ్ల తపస్సు తర్వాత నందికి నీలకంఠుడు గణాధిపత్యం ఇచ్చాడు. తనకు సన్నిహితంగా, శ్రీశైలంలో కొలువుదీరేలా అనుగ్రహించాడు. శ్రీశైలఖండం కావ్యంలో ఈ కథ ఉంది.
News September 1, 2025
కూతురి ఆరోపణలపై KCR ఇప్పటికైనా స్పందిస్తారా?

TG: కవిత కామెంట్స్‌పై ఆమె తండ్రి, మాజీ CM KCR ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం. గతంలో ఆమె కామెంట్స్ చేసినప్పుడు ఆయనేమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పార్టీలో మెయిన్ లీడర్ హరీశ్ రావుతో పాటు తన వెన్నంటే ఉండే సంతోష్‌పై <<17582704>>ఆరోపణలు<<>> చేయడాన్ని ఆయన ఎలా తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. తండ్రిగా ఆమెకు మద్దతిస్తారా? లేక పార్టీ హద్దు దాటినందుకు వేటు వేస్తారా? మీరేమంటారు?
News September 1, 2025
మద్యం ప్రియులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 వరకు బార్లు

AP: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి నూతన బార్ పాలసీ అమలు కానుంది. దీంతో ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచే ఉంటాయి. ఈ పాలసీ మూడేళ్లపాటు అమలులో ఉండనుంది. కాగా గతంలో రాత్రి 11 గంటలకే బార్లు మాసి వేసేవారు. కానీ ఈ కొత్త పాలసీతో అదనంగా మరో గంటపాటు బార్లను నిర్వహించుకోవచ్చు. కాగా ఈ పాలసీలో 10 శాతం బార్లను కల్లు గీత కార్మికులకు కూడా కేటాయించారు.