News September 26, 2024

‘కల్కి 2898 ఏడీ’ మూవీకి మరో అరుదైన అవకాశం

image

ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాకు అరుదైన అవకాశం దక్కింది. 29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్టోబర్ 2 నుంచి 11వ తేదీ వరకు ఈ మూవీని ప్రదర్శించనున్నారు. 8, 9 తేదీల్లో BIFFలోని బహిరంగ థియేటర్‌లో షోలు వేయనున్నారు. ఈ ఏడాది జూన్‌లో రిలీజైన ఈ సినిమా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

Similar News

News December 6, 2025

విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం కఠిన చర్యలు

image

ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని ఇతర విమానయాన సంస్థలు అడ్డగోలుగా టికెట్‌ ధరలు పెంచడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఛార్జీల క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేసింది. సర్వీసులు రద్దైన అన్ని రూట్లలో కొత్తగా నిర్ణయించిన ధరలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని.. ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని పేర్కొంది.

News December 6, 2025

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్

image

AP: ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 2 నుంచి 13 వరకు 9AM నుంచి 12PM వరకు ఇంటర్ పరీక్షలు, ఏప్రిల్ 11 నుంచి 18 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అలాగే టెన్త్ ఎగ్జామ్స్ మార్చి 16 నుంచి 28 వరకు 9.30AM నుంచి 12.30PM వరకు జరుగుతాయి.
వెబ్‌సైట్: https://apopenschool.ap.gov.in/

News December 6, 2025

సేంద్రియ ఎరువులు.. సాగులో వాటి ప్రాధాన్యత

image

పంటలు, మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అవసరం. ఇవి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందించి మంచి దిగుబడిని అందిస్తాయి. రసాయన ఎరువులతో కొన్ని దుష్పరిణామాలు ఉన్నందున ప్రస్తుతం చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులను వాడుతున్నారు. ఈ ఎరువులను మొక్కలు, జంతువుల వ్యర్థాలు, విసర్జితాల నుంచి తయారుచేస్తారు. సమగ్ర ఎరువుల వాడకంలో సేంద్రియ ఎరువులు ఒక భాగం. రైతులు వీటిని వ్యవసాయంలో తప్పక వాడితే సాగు వ్యయం తగ్గుతుంది.