News August 6, 2024
రోహిత్ శర్మ ముంగిట మరో రికార్డు

భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ వన్డేల్లో మరో రికార్డుకు చేరువయ్యారు. మరో రెండు సిక్సులు కొడితే వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం 331 సిక్సులతో క్రిస్ గేల్ రెండోస్థానంలో ఉండగా రోహిత్ ఖాతాలో 330 సిక్సులున్నాయి. రేపు కొలంబోలో జరిగే మూడో వన్డేలో రోహిత్ ఈ రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో 351 సిక్సులతో షాహిద్ ఆఫ్రిది అగ్రస్థానంలో ఉన్నారు.
Similar News
News December 21, 2025
అబార్షన్ తర్వాత ఈ జాగ్రత్తలు

అబార్షన్ జరిగిన తర్వాత డాక్టర్ సూచన మేరకు పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. పాలు, బ్రెడ్, పళ్లు, ఆకు కూరలు, కాయగూరలు, పప్పు దినుసులు, డ్రైఫ్రూట్స్‌తో మంచి ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల మంచి నీళ్లు తాగాలి. అధిక రక్తస్రావం, దుర్వాసన, కడుపునొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ని కలవాలి. అలాగే మూత్రంలో మంట, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తున్నా అశ్రద్ధ చేయకూడదు.
News December 21, 2025
ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు

AP: ఆచార్య NG రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ 7 టీచింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BSc, MSc(హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, హ్యూమన్ డెవలప్‌మెంట్ & ఫ్యామిలీ స్టడీస్), PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు(M), మహిళలకు 45ఏళ్లు. అర్హతగల వారు ఈనెల 29, 30 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. వెబ్‌సైట్: https://angrau.ac.in
News December 21, 2025
‘కెరీర్ మినిమలిజం’.. Gen Zలో కొత్త ట్రెండ్.. ఏంటిది?

ఆఫీసుల్లో రాత్రి పగలు కష్టపడే హజిల్ కల్చర్‌కు Gen Z చెక్ పెడుతోంది. దీన్నే కెరీర్ మినిమలిజం అంటున్నారు. అంటే పని పట్ల బాధ్యత లేకపోవడం కాదు. ప్రమోషన్లు, హోదాల వెంట పడకుండా ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం. మేనేజర్ పోస్టుల్లో ఉండే స్ట్రెస్ కంటే మెంటల్ హెల్త్, పర్సనల్ లైఫ్ ముఖ్యమని వీరు భావిస్తున్నారు. 72% మంది టీమ్ మేనేజ్‌మెంట్ కంటే స్కిల్స్ పెంచుకోవడానికే ఇష్టపడుతున్నారు.


