News June 28, 2024
రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించారు. అలాగే టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక ఫోర్లు బాదిన తొలి ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ (113) నిలిచారు. ఈ క్రమంలో ఆయన మహేల జయవర్ధనే (111) రికార్డును అధిగమించారు.
Similar News
News December 30, 2025
రైతులు ఆందోళన చెందవద్దు: తుమ్మల

TG: రాష్ట్రంలో యూరియా సరఫరా కొనసాగుతోందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జిల్లాల్లో 47.68 లక్షల సంచుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. రబీ సీజన్(అక్టోబర్-మార్చి)లో కేంద్రం రాష్ట్రానికి 20.10 లక్షల మెట్రిక్ టన్నుల(LMTs) యూరియా కేటాయించిందని తెలిపారు. ఇప్పటివరకు అందిన 5.70LMTs యూరియాలో 3.71LMTs రైతులు కొనుగోలు చేయగా 2.15LMTs జిల్లాల్లో అందుబాటులో ఉందన్నారు.
News December 30, 2025
వచ్చే ఏడాదీ రిపీట్ చేస్తారా?

కొత్త సంవత్సరం మొదలవుతుందంటే చాలు ఎక్కడ లేని రెజల్యూషన్స్ వస్తాయి. జిమ్‌కు వెళ్లడం, డైట్ మెయింటేన్ చేయడం, హెల్త్‌ను కాపాడుకోవడం, డబ్బులు సేవ్ చేసుకోవడం అంటూ నిర్ణయాలు తీసుకుంటారు. 2025 ప్రారంభంలోనూ ఇలాంటి నిర్ణయాలే తీసుకొని ఉంటారు. వీటిలో ఎన్ని ఆచరణలో పెట్టారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? మారింది ఇయర్ మాత్రమేనా? మీ లైఫ్‌లో చోటు చేసుకున్న మార్పులు ఏంటి?
News December 30, 2025
నాన్న లేని లోకంలో ఉండలేక.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన

TG: తల్లి చిన్నప్పుడే దూరమవడంతో తండ్రే లోకంగా పెరిగాడు నితిన్. తండ్రి నాగారావు అమ్మలా గోరుముద్దలు తినిపించాడు. ఫ్రెండ్స్‌లా ప్రతి విషయం షేర్ చేసుకునేవారు. అలాంటి తండ్రి 3 రోజుల క్రితం మృతిచెందడంతో తట్టుకోలేకపోయాడు. అంత్యక్రియల తర్వాత ఇంటి నిండా నిశ్శబ్దం అతడిని మరింత కుంగదీసింది. నాన్న లేని లోకంలో ఉండలేక ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా బాసరలో జరిగిన ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.


