News July 15, 2024
‘కల్కి’ ఖాతాలో మరో రికార్డు

నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా ‘కల్కి 2898 AD’ నిలిచింది. అక్కడ ఈ మూవీ 17 రోజుల్లోనే 17.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. షారుఖ్‌ఖాన్ పఠాన్($17.49M) కలెక్షన్స్‌ను అధిగమించింది. టాప్ ప్లేస్‌లో బాహుబలి-2 ($20.7M) కొనసాగుతోంది. ఓవరాల్‌గా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1000కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 4, 2026
చిత్తూరు: ఉపాధిపై రేపు గ్రామసభలు

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.
News January 4, 2026
మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్‌ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.
News January 4, 2026
అపార ఖనిజాలు.. అస్తవ్యస్త పాలన.. అంధకారం

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వెనిజులాకు సరిపోతుంది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్నది అక్కడే (18%-$17 ట్రిలియన్స్). ఐరన్, బాక్సైట్, కాపర్, జింక్, బంగారం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ కంపోనెంట్స్‌లో వాడే నికెల్ నిక్షేపాలూ అపారం. కానీ సొంత&విదేశీ శక్తులతో ప్రభుత్వంలో అస్థిరత వల్ల వాటిని తవ్వి, రిఫైన్ చేసే టెక్నాలజీ, రవాణా ఇబ్బందులతో వెనిజులా భయంకర ఆర్థిక మాంద్యంలో ఉంది.


