News January 1, 2025

బుమ్రాను ఊరిస్తున్న మరో రికార్డు

image

AUSతో జరిగే ఐదో టెస్టులో 3 వికెట్లు తీస్తే బుమ్రా ఖాతాలో మరో రికార్డు చేరుతుంది. BGT చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఆయన నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు హర్భజన్ (32 వికెట్లు, 2000-01 సిరీస్) పేరిట ఉంది. ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు 30W తీశారు. ఆయన ఇంత గొప్పగా రాణిస్తున్నా ఇతర బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్ల నుంచి మంచి ప్రదర్శన రాకపోవడం జట్టును కలవరపెడుతోంది.

Similar News

News January 4, 2025

లంచ్ సమయానికి ఆస్ట్రేలియా 101/5

image

సిడ్నీలో జరుగుతున్న BGT ఐదో టెస్టు రెండో రోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా కీలక వికెట్లను కోల్పోయింది. లంచ్ సమయానికి 101/5 స్కోర్ చేసింది. వెబ్‌స్టర్ (28), క్యారీ (4) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, ప్రసిద్ధ్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం AUS తొలి ఇన్నింగ్స్‌లో 84 రన్స్ వెనుకబడి ఉంది. కొన్‌స్టాస్ 23, ఖవాజా 2, లబుషేన్ 2, స్మిత్ 33, హెడ్ 4 రన్స్ చేశారు.

News January 4, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా విధివిధానాలు ఖరారు?

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా నిబంధనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ విధివిధానాలను నేడు ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సమగ్ర కులగణనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

News January 4, 2025

పావురాలను మేపుతున్నారా.. ఈ ప్రమాదం తెలుసా?

image

చాలామందికి పావురాల్ని మేపడం ఓ హాబీగా ఉంటుంది. వారు వేసే మేత కోసం రోడ్డుపై, కరెంటు తీగలపై వందలాదిగా పావురాలు చేరుతుంటాయి. కానీ వాటి వల్ల తీవ్రస్థాయిలో శ్వాస సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఉండే క్రిప్టోకోకస్ అనే ఫంగస్ కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ వంటి వ్యాధులు వస్తాయని.. పలు రోగకారకాలకూ పావురాలు వాహకాలని పేర్కొంటున్నారు.