News July 16, 2024
పూరీ భాండాగారంలో మరో రహస్య గది?
ఒడిశాలోని పూరీ భాండాగారంలో మరో రహస్య గది ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఈ గదిలో వెలకట్టలేని సంపద దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు. 1902లో బ్రిటిష్ అధికారులు ఈ గదిని అన్వేషించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. పూరీ రాజు కపిలేంద్రదేవ్ ఈ గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన బంగారు సింహాసనాలు, వడ్డాణాలు, పసిడి విగ్రహాలను దాచినట్లు చెబుతున్నారు.
Similar News
News January 22, 2025
‘గోల్డ్ రా మన తమన్ అన్న’
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇస్తుంటారు. తాజాగా ఓ యువకుడు తన బాధను తమన్ దృష్టికి తీసుకెళ్లగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తాను ఓ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ అని, అది పాడైపోయిందని చెప్పడంతో కొత్తది కొనిస్తానని హామీ ఇచ్చారు. వివరాలు చెప్పాలని కోరారు. దీంతో తమన్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తమన్ గోల్డ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News January 22, 2025
జియో, AirTel వాడుతున్నారా?
ఇంటర్నెట్ వాడని యూజర్లకు ఖర్చు తగ్గించేందుకు కాల్స్, SMSల కోసం ప్రత్యేక ప్లాన్లు తేవాలని ట్రాయ్ చెప్తే టెలికం కంపెనీలు మాత్రం తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాన్లలో డేటా కట్ చేసి రేట్లు అలాగే ఉంచాయి. డేటా ఉండే రూ.479 ప్యాక్ ధరను జియో రూ.60 పెంచి రూ.539గా నిర్ణయించింది. రూ.1,999 ప్లాన్ ధరను రూ.350 పెంచి రూ.2,249 చేసింది. అటు AirTel సైతం డేటా తొలగించి, ప్లాన్ రేట్లను పెంచింది.
News January 22, 2025
గ్లోబల్ టాలెంట్ హబ్‌గా ఏపీ: నారా లోకేశ్
AP: రాష్ట్రాన్ని గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మారుస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దావోస్‌లో విద్యారంగ గవర్నర్ల భేటీలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో 3 AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం మధ్యంతర బడ్జెట్లో రూ.255 కోట్లు కేటాయించాం. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం’ అని చెప్పారు. APలో ఐటీ కార్యకలాపాలను ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ను కోరారు.