News June 8, 2024

T20 వరల్డ్‌కప్‌లో మరో సంచలనం

image

టీ20 WCలో న్యూజిలాండ్‌కు అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. గ్రూప్-Cలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచులో 84 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన AFG 159 రన్స్ చేయగా, అనంతరం కివీస్ 75 పరుగులకే ఆలౌటైంది. AFG జట్టులో గుర్బాజ్ 80, జద్రాన్ 44 రన్స్‌తో రాణించారు. రషీద్ ఖాన్ 4, ఫారూఖీ 4, నబీ 2 వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో ఇప్పటికే పాకిస్థాన్‌ను USA ఓడించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

Similar News

News January 11, 2025

మా కార్యకర్తల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం: కేటీఆర్

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ కార్యాలయంపైన జరిగిన దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. అది కాంగ్రెస్ గూండాల దాడి అని ఆరోపించారు. ‘మా పార్టీ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ గూండారాజ్యం నడుస్తోంది. ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దాడికి పాల్పడిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి’ అని ట్విటర్లో డిమాండ్ చేశారు.

News January 11, 2025

ప్రముఖ నటుడికి బ్రెయిన్ స్ట్రోక్

image

ప్రముఖ హిందీ నటుడు, కమెడియన్ టీకూ తల్సానియా(70) బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనట్లు భార్య దీప్తి వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆయనకు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలను ఖండించారు. 1986లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన టీకూ దాదాపు 200 చిత్రాలు, 11 సీరియళ్లలో కీలక పాత్రలు పోషించారు. ఆయన కూతురు శిఖ కూడా సత్యప్రేమ్ కీ కథ, వీర్ దీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించారు.

News January 11, 2025

వైసీపీ హయాంలో పోలవరం ధ్వంసం: రామానాయుడు

image

AP: పోలవరం ప్రాజెక్టును YCP సర్కార్ 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఏడాదిన్నర కష్టపడి డయాఫ్రం వాల్ నిర్మిస్తే YCP దానిని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పార్లమెంటరీ కమిటీకి ఆయన స్వాగతం పలికారు. 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. సీఎం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.