News July 27, 2024
శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ

టీమ్ ఇండియాతో నేడు టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేసర్ బినుర ఫెర్నాండో ఛాతి ఇన్ఫెక్షన్ బారిన పడ్డట్లు శ్రీలంక క్రికెట్ తెలిపింది. దీంతో తొలి మ్యాచ్కు ఆయన దూరం కానున్నట్లు పేర్కొంది. ఫెర్నాండో స్థానంలో ఆల్రౌండర్ రమేశ్ మెండిస్ స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికయ్యారు. ఇప్పటికే నువాన్ తుషారా, దుష్మంత చమీరా గాయాలతో బాధపడుతూ సిరీస్ నుంచి తప్పుకున్నారు.
Similar News
News October 20, 2025
మన ఆచారాల వెనుక దాగున్న సైన్స్

మన సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఆధ్యాత్మిక కారణాలే కాదు! ఆరోగ్య, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మన పెద్దలు చెప్పులు ఇంటి బయటే వదలమంటారు. బయటకు వెళ్లి రాగానే కాళ్లూచేతులు కడగమంటారు. పుడితే పురుడని, మరణిస్తే అంటు అని అందరికీ దూరంగా ఉండాలంటారు. సెలూన్కి వెళ్తే స్నానం చేయనిదే ఇంట్లోకి రానివ్వరు. మహిళలు స్నానం చేయనిదే వండొద్దని అంటారు. వీటికి కారణం క్రిములను ఇంట్లోకి రాకుండా నిరోధించడమే.
News October 20, 2025
ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి: చిరంజీవి

నాగార్జున, వెంకటేశ్, నయనతారతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపేస్తాయి. ప్రేమ, నవ్వు, కలిసి ఉండటం వల్ల జీవితం వెలిగిపోతుందన్న విషయాన్ని గుర్తు చేస్తాయి’ అని ట్వీట్ చేశారు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో హీరోయిన్గా నయనతార, స్పెషల్ రోల్లో వెంకీ మామ కనిపించనున్నారు.
News October 20, 2025
రేపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఏపీలోని బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో రేపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.