News March 30, 2025

హార్దిక్‌ పాండ్యకు మరో షాక్!

image

వరుస ఓటముల్లో ఉన్న MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. నిన్న GTతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆయనకు IPL గవర్నింగ్ కౌన్సిల్ రూ.12లక్షల జరిమానా విధించింది. ఈ ఏడాది ఓ కెప్టెన్‌కు ఫైన్ పడటం ఇదే తొలిసారి. గత సీజన్‌ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ ఉండటంతో ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో హార్దిక్ నిషేధానికి గురయ్యారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ తరచూ జరిమానాల్ని ఎదుర్కొంటున్నారు.

Similar News

News April 1, 2025

దుమ్మురేపుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’ కలెక్షన్లు

image

‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ కలెక్షన్లలో అదరగొడుతోంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.69.4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ‘థియేటర్లలో నవ్వులు.. థియేటర్ల బయట హౌస్ ఫుల్ బోర్డులు’ అని రాసుకొచ్చింది. MADకు సీక్వెల్‌గా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

News April 1, 2025

గచ్చిబౌలి భూముల వ్యవహారంపై కేంద్రానికి బీజేపీ ఎంపీల వినతి

image

TG: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో తెలంగాణ బీజేపీ ఎంపీలు భేటీ అయ్యారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని కోరారు. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు రాజ్యసభలో కె.లక్ష్మణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని కోరారు.

News April 1, 2025

గిగ్ వర్కర్ల కోసం ‘AC రెస్ట్ రూమ్స్’

image

వేసవిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఫుడ్, ఆన్‌లైన్ డెలివరీలు చేస్తూ ఇబ్బందిపడే గిగ్ వర్కర్ల కోసం చెన్నై కార్పోరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి కాస్త ఉపశమనం కలిగించేందుకు చెన్నైలోని ప్రధాన రోడ్లపై ‘AC రెస్ట్ రూమ్స్’ను ఏర్పాటు చేయనుంది. స్విగ్గీ, జొమాటో, ఉబర్ డెలివరీ పార్ట్నర్స్ వీటిని ఉపయోగించుకోనున్నారు. ఈ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి. HYDలోనూ ఇలాంటి ఏర్పాటు చేయాలని డిమాండ్ నెలకొంది.

error: Content is protected !!