News October 23, 2024
హెజ్బొల్లాకు మరో షాక్

హెజ్బొల్లా గ్రూప్‌కు వారసుడిగా భావిస్తున్న నస్రల్లా బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ దళాలు హతమార్చినట్లు IDF ప్రకటించింది. 3వారాల క్రితం లెబనాన్ దహియాలోని ఓ బంకర్లో సమావేశంలో ఉండగా జరిపిన దాడిలో అతడు చనిపోయాడంది. అతడితో పాటు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీహుస్సేన్ హజిమా, పలువురు కమాండర్లు మృతిచెందారంది. అటు తదుపరి హెజ్బొల్లా పగ్గాలు ఎవరు అందుకుంటారనేది ఆసక్తిగా మారింది.
Similar News
News November 20, 2025
క్రెడిట్ కార్డ్ హోల్డర్స్‌కు ‘ఫేక్ కాల్స్’ అలర్ట్

సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేసుకుని స్కామ్ చేస్తున్నట్లు PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది. ‘ఓ స్కామ్‌లో మీ క్రెడిట్ కార్డు వాడారు. మీ కార్డును బ్లాక్ చేయబోతున్నాం’ అని RBI పేరిట వచ్చే కాల్స్, వాయిస్ మెయిల్స్, మెసేజెస్ అన్నీ ఫేక్ అని తేల్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ లోగో, ఫొటో, వీడియోలు వాడిన అంశాలపై ఎలాంటి అనుమానం ఉన్నా ‘8799711259’ నంబరుకు పంపాలని సూచించింది.
News November 20, 2025
నేటి ముఖ్యాంశాలు

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఏడుగురు మావోలు మృతి