News July 2, 2024

యూజర్లకు జియో మరో షాక్!

image

ఇప్పటికే టారిఫ్‌లు పెంచిన జియో 2 పాపులర్ ప్లాన్స్‌లను తొలగించి తన యూజర్లకు మరో షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూజర్లు ఎక్కువగా వాడే ₹395, ₹1,559 ప్లాన్లను తొలిగించిందట. కొత్త టారిఫ్‌లు జులై 3 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఒక విడత అదనపు ఛార్జీలు తప్పించుకునేందుకు ఒకరోజు ముందే రీఛార్జ్ చేసుకోవడానికి యూజర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా ఆ 2 ప్లాన్లు కనిపించడం లేదని కొందరు Xలో ఫిర్యాదులు చేస్తున్నారు.

Similar News

News January 13, 2026

ముంబై టార్గెట్ ఎంతంటే?

image

WPL-2026లో ముంబైతో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 192/5 స్కోరు చేసింది. ఓపెనర్ డివైన్(8) విఫలమవ్వగా మూనీ(33) ఫర్వాలేదనిపించారు. చివర్లో ఫుల్మాలి 15 బంతుల్లో 36 రన్స్ చేయగా, జార్జియా(43) తోడ్పాటునందించారు. ముంబై బౌలర్లలో ఇస్మాయిల్, మాథ్యూస్, కేరీ, అమేలియా తలో వికెట్ తీశారు. MI టార్గెట్ 193.

News January 13, 2026

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

image

ఇరాన్ ప్రజలు తమ పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ‘ఇరాన్ దేశభక్తులారా.. ప్రభుత్వ సంస్థలను చేజిక్కించుకోండి. మిమ్మల్ని చంపే వారి, నిందించే వారి పేర్లను సేవ్ చేసుకోండి. వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నిరసనకారులను చంపడం ఆపేంత వరకు ఇరాన్ ప్రతినిధులతో నా మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నా. మీకు అతిత్వరలో సాయం అందబోతోంది. Make Iran Great Again (MIGA)!’ అని ట్రంప్ పోస్ట్ చేశారు.

News January 13, 2026

నిరసనలు ప్రపంచానికి తెలియకుండా.. ఇంటింటికీ వెళ్లి..!

image

నిరసనలను ఉక్కుపాదంతో అణచేస్తున్న ఇరాన్ ఆ వివరాలు ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడుతోంది. ఇప్పటికే ఇంటర్నెట్‌ నిలిపేయగా, మస్క్‌కు చెందిన <<18836391>>స్టార్‌లింక్ సేవలనూ<<>> 80% కట్ చేసింది. ఇంకా వాడుతున్న వారిని వెంటాడుతోంది. ఇళ్లలో సోదాలు చేసి స్టార్‌లింక్ పరికరాలు స్వాధీనం చేసుకుంటోంది. అధికారులు, ఖమేనీ సపోర్టర్లు ‘వైట్‌లిస్ట్(అనుమతి ఉన్న వారికే యాక్సెస్ ఉండే)’ నెట్‌వర్క్‌లో కమ్యూనికేట్ అవుతున్నారు.