News March 27, 2025

కన్నడిగులకు మరో షాక్!

image

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాల ధరలను లీటరుకు రూ.4 పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ ధరలను లీటరుకు రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కోరగా సీఎం సిద్దరామయ్య రూ.4 పెంచేందుకు అంగీకరించారు. ఇటీవలే అక్కడ కరెంట్ ఛార్జీలను పెంచారు. 6 గ్యారంటీలే ధరల పెరుగుదలకు కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.

Similar News

News March 30, 2025

నెలవంక దర్శనం.. రేపే రంజాన్

image

మన దేశంలో నెలవంక దర్శనమిచ్చింది. దీంతో రేపు రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్)జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రభుత్వాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. హైదరాబాద్ మక్కా మసీద్, మీరాలం ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రంజాన్ సందర్భంగా రేపు సెలవు ప్రకటించారు.

News March 30, 2025

విషాదం.. ఆరుగురి మృతి

image

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ గాలులు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఆరుగురు మరణించారు. కులు సమీపంలోని పర్యాటక ప్రాంతంలో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. వాటితో పాటు రాళ్లు, శిథిలాలు ఓ వ్యానుతో పాటు అక్కడ కూర్చున్న పర్యాటకులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.

News March 30, 2025

కొత్త రేషన్ కార్డుల్లో 30 లక్షల మంది: సీఎస్

image

TG: కొత్తగా రేషన్ కార్డుల్లో 30లక్షల మందిని చేర్చనున్నామని సీఎస్ శాంతికుమారి చెప్పారు. హుజూర్ నగర్‌లో జరిగిన సన్నబియ్యం పథకం ప్రారంభోత్సవంలో ఆమె మాట్లాడారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. కొత్తగా 10 లక్షల రేషన్ కార్డులు జారీ కానున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!