News April 2, 2025
UPI పేమెంట్స్ చేసేవారికి మళ్లీ షాక్

ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం యాప్స్‌లో యూపీఐ పేమెంట్స్ మరోసారి నిలిచిపోయాయి. గతవారం కూడా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్డ్ కాగా ఇవాళ సాయంత్రం నుంచి పేమెంట్స్ కావడం లేదంటూ యూజర్లు సోషల్ మీడియాలో తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో పంపుతున్న డబ్బులు ప్రాసెసింగ్‌లో పడి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? కామెంట్ చేయండి.
Similar News
News April 3, 2025
ఈనెల 18న ‘అర్జున్ S/O వైజయంతి’ రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని ఈనెల 18న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోకు తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
News April 3, 2025
రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు

AP: విశాఖలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన 35 ఎకరాల్లో 15.17 ఎకరాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఓ ప్రయోజనం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని మిగతా వాటికోసం వినియోగిస్తే రద్దు చేయాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం స్టూడియోకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా కలెక్టర్‌ను ఆదేశించారు.
News April 3, 2025
BREAKING: గురుకుల CET ఫలితాలు విడుదల

TG: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం FEB నెల 23న నిర్వహించిన TG CET ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకులాల్లో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఫలితాల్లో 36,334 మంది సీట్లు పొందారు. వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్లకు గాను త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <