News July 31, 2024
‘పుష్ప-2’ నుంచి మరో షూటింగ్ వీడియో లీక్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘పుష్ప-2’ను లీకులు వెంటాడుతున్నాయి. సినిమా షూటింగ్‌ను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తాజాగా క్లైమాక్స్ ఫైట్ సీన్ షూటింగ్ అంటూ ఓ వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. దాన్ని డిలీట్ చేయాలని, లీకు వీరులపై చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కాగా, డిసెంబర్ 6న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కానుంది.
Similar News
News April 3, 2026
25 ఏళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళ

చైనాకు చెందిన బ్యూటీ ప్రొడక్ట్స్ వ్యాపారవేత్త, బిలియనీర్ యు వెన్‌హాంగ్(55) తన కంటే 30ఏళ్ల చిన్నవాడైన మోడల్‌ను పెళ్లి చేసుకోవడం SMలో వైరల్ అవుతోంది. తన కంపెనీలో పనిచేసిన లియు యుచెన్‌ను 6వ పెళ్లి చేసుకున్నారు. కట్నంగా అతనికి ₹60కోట్లకు పైగా విలువైన ఆస్తులు, కార్లు ఇచ్చారు. ఆమె 45ఏళ్ల వయసులోనూ 25ఏళ్ల యువకుడిని పెళ్లి చేసుకోగా ఆ రిలేషన్ బ్రేక్ అయింది. కాగా ఆమెకు ఇదివరకే ఇద్దరు కొడుకులున్నారు.
News April 3, 2026
ఒత్తైన జుట్టు కోసం ఉసిరి నూనె

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
News April 3, 2026
ఐరన్ టాబ్లెట్లు ఎప్పుడు తీసుకోవాలంటే

ఐరన్ లోపించినప్పుడు, శరీరం అవసరం మేరకు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల కణజాలాలకు, అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనికోసం ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. వీటిని పరగడపున తీసుకుంటే చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఐరన్‌తో పాటు వేరే మందులు తీసుకోవద్దు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న గంట వరకూ డెయిరీ ప్రోడక్ట్స్ అయిన పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు.


