News December 1, 2024
‘OG’లో మరో స్టార్ హీరో?

సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’పై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ రూమర్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్‌కు చెందిన మరో స్టార్ హీరో మూవీ క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇస్తారని సమాచారం. ‘సాహో’ కథ జరిగిన ప్రపంచంలోనే OG స్టోరీ కూడా ఉంటుందని ఇప్పటికే పలుమార్లు వార్తలొచ్చాయి. దీంతో ఆ హీరో ప్రభాసేనా అన్న చర్చ నడుస్తోంది. దీనిలో నిజమెంతో చూడాలి మరి.
Similar News
News October 17, 2025
ఆర్మీ క్యాంప్‌పై ‘ఉల్ఫా’ అటాక్

అస్సాంలో ఉల్ఫా మిలిటెంట్లు రెచ్చిపోయారు. తిన్సుకియా జిల్లాలోని కాకోపతార్ ప్రాంతంలో ఆర్మీ క్యాంప్‌పై అర్ధరాత్రి అటాక్ చేశారు. గ్రెనేడ్లు విసిరి తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. ట్రక్కులో వచ్చిన మిలిటెంట్లు సుమారు 30 నిమిషాల పాటు దాడులు చేసి పారిపోయారు. దీంతో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు స్థానిక అడవుల్లో మిలిటెంట్ల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.
News October 17, 2025
ప్రిన్సిపల్ చనిపోయారంటూ ఫేక్ లెటర్.. చివరికి

పరీక్షల వాయిదా కోసం ఇద్దరు విద్యార్థులు బరితెగించారు. MP ఇండోర్ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో BCA చదువుతున్న వారు కళాశాల లెటర్ హెడ్ సంపాదించారు. ప్రిన్సిపల్ అనామిక హఠాత్తుగా చనిపోయారని, ఈనెల 15,16న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాసి SMలో వైరల్ చేశారు. అసలు విషయం బయటపడటంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కాలేజీ 60రోజులు సస్పెండ్ చేసింది. ఇద్దరికీ మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.
News October 17, 2025
మహిళల కోసం ఇన్ఫోసిస్ కొత్త ప్రోగ్రామ్

కనీసం 6 నెలల కెరీర్ గ్యాప్ వచ్చిన మహిళా నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు ఇన్ఫోసిన్ ముందుకొచ్చింది. ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ ఇనిషేటివ్’ పేరుతో గత నెల కొత్త రిఫరల్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులైన మహిళలను రిఫర్ చేయొచ్చు. వారు జాబ్‌కు ఎంపికైతే లెవెల్-3లో రూ.10వేలు, లెవెల్-4లో రూ.25వేలు, లెవెల్-5లో రూ.35వేలు, లెవెల్ 6లో రూ.50వేల వరకు రివార్డులు అందించనుంది.