News November 21, 2024

మరో విజయం సాధించిన తెలుగు టైటాన్స్

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11లో తెలుగు టైటాన్స్ అద్భుతంగా రాణిస్తోంది. ఇవాళ యూ ముంబాతో జరిగిన మ్యాచులో 31-29 తేడాతో గెలిచింది. టైటాన్స్ జట్టులో రైడర్ ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లతో రాణించారు. ఈ విజయంతో టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచుల్లో 7 విజయాలు సాధించింది. రేపు బెంగాల్ వారియర్స్‌తో తలపడనుంది.

Similar News

News November 26, 2024

మహారాష్ట్ర CM పీఠానికి 2 ఆప్షన్లు!

image

మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి ఘన విజయం సాధించగా CM పీఠం ఎవరిదనే దానిపై ఉత్కంఠ వీడలేదు. 2 ఆప్షన్లపై కూటమి నేతలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఫడణవీస్, ఏక్‌నాథ్ శిండే చెరో రెండున్నరేళ్లు కుర్చీ పంచుకోవడం తొలి ఆప్షన్ కాగా, 2+2+1(ఫడణవీస్, శిండే, అజిత్ పవార్) ఫార్ములాతో సీఎం పీఠాన్ని అధిష్ఠించడం రెండో ఆప్షన్. రెండ్రోజులుగా దీనిపై నడ్డా, అమిత్ షా చర్చలు జరుపుతుండగా ఇవాళ ఫైనల్ అయ్యే ఛాన్సుంది.

News November 26, 2024

మినీ బస్సు బోల్తా.. ఆరుగురు ‘కాంతార’ నటులకు గాయాలు

image

‘కాంతార: ఛాప్టర్-1’ సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక జడ్కల్‌లోని ముదూర్‌లో షూటింగ్ ముగించుకుని కొల్లూరుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అది చిన్న ప్రమాదమేనని, యథావిధిగా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది.

News November 26, 2024

నేడు ‘రాజ్యాంగ దినోత్సవం’.. ఎందుకంటే?

image

మన రాజ్యాంగానికి 1949 NOV 26న ఆమోదం లభించినా స్వాతంత్ర్యం ఇస్తామని బ్రిటీషర్లు మభ్యపెట్టడంతో అమలుకు 2నెలలు పట్టింది. అంతకముందు నెహ్రూ తక్షణ స్వాతంత్ర్యానికి 1929 DEC 31న జెండాను ఎగరేశారు. ఆపై 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించి 1950లో అదే రోజు రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. 2015న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125జయంతి సంవత్సరం సందర్భంగా PM మోదీ నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు.