News April 11, 2025

రామ్ చరణ్ ‘పెద్ది’లో మరో సర్ప్రైజ్?

image

రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. లాస్ట్ షాట్‌లో చెర్రీ సిక్స్ కొట్టిన స్టైల్ అదుర్స్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే, మూవీలో క్రికెట్‌తో పాటు రెజ్లింగ్ సీన్స్ ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇస్తాయని టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని మేనరిజమ్స్, నటనతో చెర్రీ కట్టిపడేస్తారని అంటున్నారు. ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్తయిందని, కీలక ఫైట్స్ షూట్ చేశారని సమాచారం.

Similar News

News October 15, 2025

‘తెలంగాణ విజన్’… మీ ఆలోచన ఏంటి?

image

తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ డాక్యుమెంట్‌ను రూపొందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని టాప్‌లో నిలబెట్టేలా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. వ్యవసాయం, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, స్థానిక సంస్థల బలోపేతం సహా పలు అంశాలపై ప్రతి పౌరుడు తప్పనిసరిగా OCT 25 లోగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మీ ఆలోచన పంచుకోవడానికి <>క్లిక్ <<>>చేయండి.

News October 15, 2025

ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు

image

TG: సింగరేణి కార్మికులకు అక్టోబర్ 17న దీపావళి బోనస్ అందనుంది. పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు(PLR)గా పిలిచే ఈ బోనస్ కింద ఈ ఏడాది రూ.1.03 లక్షల చొప్పున చెల్లించేలా బొగ్గు సంస్థల <<17842581>>యాజమాన్యాలు <<>>అంగీకరించాయి. కోల్ ఇండియా కింద ఉన్న అన్ని సంస్థలూ బోనస్ చెల్లించనుండగా, సింగరేణి మినహా మిగతా వారికి దసరా సమయంలోనే అందించారు. ఎల్లుండి సింగరేణి కార్మికుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.

News October 15, 2025

వంటింటి చిట్కాలు

image

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.