News April 30, 2024
‘కల్కి’ నుంచి మరో సర్‌ప్రైజ్ వస్తోంది!

వరుస అప్‌డేట్స్‌తో ‘కల్కి 2898ఏడీ’ సినిమాపై మేకర్స్ అంచనాలను పెంచుతున్నారు. ఇటీవల అశ్వత్థామ పరిచయ వీడియో, మూవీ రిలీజ్ డేట్‌ను వెల్లడించగా తాజాగా మరో సర్‌ప్రైజ్ ఉందంటూ ప్రకటించారు. ‘డార్లింగ్స్. మీకు ఒక చిన్న సర్‌ప్రైజ్. వేచి ఉండండి’ అని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ ఇవ్వొచ్చని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 20, 2026
నేడు తిరుమలకు చంద్రబాబు, లోకేశ్

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. రేపు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకోనున్నారు. మంత్రి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ నుంచి రేణిగుంట, అక్కడి నుంచి తిరుమలకు చేరుకోనున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో తిరుపతి చేరుకొని అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి రాత్రి బస చేస్తారు. రేపు ఉదయం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు.
News March 20, 2026
4 విడతల్లో 41 నోటిఫికేషన్లు!

AP: రాష్ట్ర ప్రభుత్వం నిన్న <<19422391>>జాబ్ క్యాలెండర్<<>> రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాదిలోనే 10,060 పోస్టులు భర్తీ చేస్తామంది. ఇందుకోసం 4 విడతల్లో విభాగాల వారీగా 41 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా DSC-2,535, కానిస్టేబుల్-1,970, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్-1,500, గ్రూప్2-750, AEE-503, SI-418, ఎక్సైజ్ కానిస్టేబుల్-400, ప్లానింగ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్-251 ఖాళీలు ఉన్నాయి.
News March 20, 2026
ఇండియన్లు సంతోషంగా లేరు!

UN రిలీజ్ చేసిన ‘ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ రిపోర్ట్’ ప్రకారం ఇండియన్లు సంతోషంగా లేరని తేలింది. 147 దేశాలపై చేసిన స్టడీలో భారత్ 116వ స్థానంలో ఉంది. సామాజిక మద్దతు, ఆర్థిక అసమానతలు, పట్టణీకరణ, వ్యక్తిగత స్వేచ్ఛ, GDP, అవినీతి అంశాల ఆధారంగా ర్యాంకులు ఇచ్చింది. ఫిన్లాండ్ వరుసగా 9వ సారి టాప్-1గా నిలిచింది. అఫ్గాన్(147) చివర్లో ఉండగా, పాక్(104) మనకన్నా ముందుండటం ఆశ్చర్యకరం.
*నేడు అంతర్జాతీయ సంతోష దినోత్సవం


