News June 19, 2024
టీమ్ఇండియాకు మరో టెన్షన్

T20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజీకి సంబంధించిన మ్యాచ్ అంపైర్లను ICC ప్రకటించింది. అందులో రిచర్డ్ కెటిల్‌బరో ఉండటంతో టీమ్ఇండియా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 24న జరిగే ఆస్ట్రేలియా VS ఇండియా మ్యాచ్‌లో ఆన్-ఫీల్డ్ అంపైర్‌గా ఆయన వ్యవహరించనున్నారు. రిచర్డ్ ఉన్న ప్రతి మ్యాచ్‌లో ఇండియా ఓడిపోతూ వస్తోంది. ఆయన అంపైరింగ్‌లో 2014 T20 WC, 2015 ODI WC, 2016 T20 WC, 2017 CT, 2019 ODI WCలోనూ ఇండియా ఓడిపోయింది.
Similar News
News November 28, 2025
సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేం: హైకోర్టు

TG: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన <<18403510>>జీవో 46ను<<>> సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ దశలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ విడుదలయ్యాక కోర్టుల జోక్యం ఉండదన్న ఈసీ తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.
News November 28, 2025
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్‌పై రేప్ కేసు నమోదు

కేరళ పాలక్కాడ్ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్‌కూటత్తిల్‌పై అత్యాచార కేసు నమోదైంది. ఆయన తనను రేప్ చేసి గర్భం దాల్చాక అబార్షన్ చేయించుకోవాలని బెదిరించాడని ఓ యువతి CM విజయన్‌కు ఫిర్యాదు చేశారు. వీరిద్దరి మధ్య ఆడియో రికార్డులు, చాటింగ్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే తాను ఏ తప్పూ చేయలేదని, చట్టపరంగా కేసును ఎదుర్కొంటానని MLA చెప్పారు. కాగా రాహుల్ ప్రాథమిక సభ్యత్వాన్ని INC రద్దు చేసింది.
News November 28, 2025
తులసి ఆకులను నమలకూడదా?

తులసి ఔషధ గుణాలు కలిగిన మొక్కగా గుర్తింపు పొందింది. అయితే ఈ మొక్క ఆకులను నమలకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. తులసి ఆకుల్లో ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది పంటిపై ఉన్న ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. ఫలితంగా పళ్ల రంగు మారవచ్చు. అయితే ఆకులను నమలకుండా మింగితే ఎన్నో రోగాలు నయమవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. జలుబు, దగ్గుతో పోరాడి తులసి క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది.


