News June 13, 2024
జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గండోహ్ ప్రాంతంలో సెర్చ్ టీమ్‌పై కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు ఇందుకు దీటుగా బదులిచ్చారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ముష్కరుల కోసం మరిన్ని బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. మరోవైపు పరారీలో ఉన్న నలుగురి ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు రిలీజ్ చేశారు. కాగా జమ్మూకశ్మీర్‌లో గత మూడు రోజుల్లో ఇది నాలుగో ఉగ్రదాడి కావడం గమనార్హం.
Similar News
News December 30, 2024
APPLY NOW.. నెలకు రూ.1000
CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును JAN 10 వరకు పెంచారు. CBSEలో 70% మార్కులతో టెన్త్ పాసైన అమ్మాయిలు దీనికి అర్హులు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని ప్రోత్సహించేలా దీన్ని అమలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు ₹1000 చొప్పున రెండేళ్లు అందుతాయి. కుటుంబ వార్షికాదాయం ₹8లక్షలలోపు ఉండాలి. 11వ తరగతి పూర్తైన వారు మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. దరఖాస్తు కోసం ఇక్కడ <
News December 29, 2024
ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త
తెలంగాణలో రానున్న 5 రోజులు ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. రేపు 17-30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News December 29, 2024
మాతృభాష తల్లి పాలలాంటిది: కందుల దుర్గేశ్
AP: మాతృ భాష తల్లిపాలలాంటిదని, పరాయి భాష పోతపాలలాంటిదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన మాట్లాడారు. ‘విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. గత ప్రభుత్వం తెలుగు భాషకు తూట్లు పొడిచింది. ఇంగ్లిష్ మీడియం పేరుతో తెలుగుకు ద్రోహం చేసింది. తెలుగు భాష పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యువత పుస్తకాలు చదివేలా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.