News June 29, 2024
‘కల్కి’ సీక్వెల్‌కు మరో మూడేళ్లు?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే క్లైమాక్స్ పూర్తికాకపోవడంతో ఈ మూవీకి పార్ట్-2 ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో యాస్కిన్‌తో అశ్వత్థామ, భైరవ పోరాడే కథ కొనసాగుతుందని, కల్కికి సీక్వెల్ ఉందని నాగ్ అశ్విన్ స్పష్టతనిచ్చారు. కానీ, దీనికి మరో మూడేళ్లు ఆగాల్సిందేనని సినీవర్గాలు అంచనా. కాగా ప్రభాస్ ‘సలార్’కు కూడా సీక్వెల్ ఉంది.
Similar News
News November 7, 2025
మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

AP: ఫైల్స్ క్లియరెన్స్‌లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్మెంట్ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.
News November 6, 2025
రూ.18వేల కోట్ల షేర్ల బైబ్యాక్.. డేట్ ఫిక్స్

ఇన్ఫోసిస్ ఈ నెల 14న ₹18వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ బైబ్యాక్‌కు నందన్ నీలేకని, సుధామూర్తి సహా కంపెనీ ప్రమోటర్లు దూరంగా ఉండనున్నారు. వీరికి సంస్థలో 13.05% వాటా ఉంది. వాటాదారులకి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10Cr షేర్లను ₹1,800 చొప్పున కంపెనీ కొనుగోలు చేయనుంది.(కంపెనీ తన సొంత షేర్లను బహిరంగ మార్కెట్/వాటాదారుల నుంచి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు)
News November 6, 2025
సచివాలయాలకు అందరికీ ఆమోదయోగ్యమైన పేరే: మంత్రి డోలా

AP: ప్రజల కోరిక మేరకే గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మారుస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన పేరే పెట్టనున్నట్లు స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థలో సీఎం చంద్రబాబు సమగ్ర మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు కనీసం జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుందని మంత్రి విమర్శించారు.


