News August 7, 2024
హాకీలో మరో‘సారీ’

పారిస్ ఒలింపిక్స్ మెన్స్ హాకీ సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమితో భారత్‌కు స్వర్ణం మరోసారి కలగానే మిగిలింది. ఈ సారైనా 44 ఏళ్ల కలను సాకారం చేద్దామనుకున్నా ఉత్కంఠ పోరులో జర్మనీ మ్యాచును గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో పరాజయానికి ఆ జట్టు స్వీట్ రివేంజ్ తీర్చుకుంది. దీంతో మరోసారి భారత్ కాంస్య పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచులో గెలిచి శ్రీజేశ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Similar News
News January 2, 2026
Yum! డీల్.. McD, డొమినోస్‌కు గట్టి పోటీ

దేవయాని, సపైర్ సంస్థల విలీనంతో మెక్ డొనాల్డ్స్, డొమినోస్‌కు సంస్థలకు గట్టి పోటీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. USA కంపెనీ Yum!కి చెందిన KFC, పిజ్జా హట్‌లను దేశంలో దేవయాని, సపైర్ వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. ఇప్పుడీ $934 మిలియన్ల డీల్‌తో మెర్జర్ ప్రకటించాయి. దీంతో వీటికి మ్యాన్‌పవర్, కార్గో తదితర కాస్ట్ తగ్గి ఆఫర్స్ సహా కొత్త బై ప్రొడక్ట్స్‌తో ప్రత్యర్థులకు కాంపిటీషన్ ఎక్కువ కావచ్చు.
News January 2, 2026
సకల శాఖల విచ్ఛిన్న మంత్రి మిస్సింగ్: YCP

AP: సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ విదేశాల్లో వ్యక్తిగత పర్యటనల్లో ఉన్నారన్న వార్తలపై వైసీపీ కౌంటర్లు వేస్తోంది. ‘అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు, సకల శాఖల విచ్ఛిన్న మంత్రి నారా లోకేశ్ ఎక్కడికి వెళ్లారు? ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు’ అంటూ ట్వీట్లు చేసింది. వాళ్లు కనబడుటలేదు అంటూ పోస్టర్లు కూడా క్రియేట్ చేసింది. వారి వ్యక్తిగత పర్యటనపై గోప్యత ఎందుకని YCP నేతలు ప్రశ్నిస్తున్నారు.
News January 2, 2026
స్పెయిన్ కాబోయే రాణి గురించి తెలుసా?

స్పెయిన్ రాణిగా ప్రస్తుత రాజు ఫెలిపే VI కుమార్తె లియోనోర్(20) పట్టాభిషేకం జరగనుంది. ఈ యువరాణి ప్రస్తుతం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో కఠిన శిక్షణ పొందుతున్నారు. లియోనోర్ బహుభాషా కోవిదురాలు. ఇటీవలే ఒంటరిగా PC-21 ఫ్లైట్ నడిపి చరిత్ర సృష్టించారు. కఠినమైన శిక్షణ, క్రమశిక్షణతో తదుపరి రాణిగా బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆమె నిరూపించారు. అందం, సాహసాలతో ఆమె నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు.


