News July 16, 2024
ఏపీలో మరో ఘోరం

<<13600394>>నంద్యాల<<>>, <<13625931>>విజయనగరం<<>> జిల్లాల్లో బాలికలపై అఘాయిత్యాలు మరవకముందే గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని(13) అదే గ్రామానికి చెందిన గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంట్లోని మంచంపై శవమై కనిపించడం సంచలనం రేపుతోంది. బాలిక ఒంటిపై గాయాలు ఉండటంతో నాగరాజే అత్యాచారం, హత్య చేసి పరారయ్యాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 3, 2025
లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.
News December 3, 2025
మరోసారి వార్తల్లో కర్ణాటక సీఎం.. వాచ్ ప్రత్యేకతలివే

కర్ణాటకలో కుర్చీ వివాదం సద్దుమణగక ముందే CM సిద్దరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. శాంటోస్ డి కార్టియర్ మోడల్ లగ్జరీ వాచ్ ధర రూ.43 లక్షల 20 వేలు. 18K రోజ్ గోల్డ్‌తో తయారైంది. సిల్వర్ వైట్ డయల్‌లో గంటలు, నిమిషాలు, సెకన్ల పిన్స్ సెల్ఫ్ వైండింగ్ మెకానికల్ మూవ్‌మెంట్‌తో పని చేస్తాయి. 6వ నంబర్ ప్లేస్‌లో డేట్ ఫీచర్, 39.88mm వెడల్పు, 9mm మందం ఉంది.
News December 3, 2025
పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: షర్మిల

కోనసీమకు TG ప్రజల దిష్టి తగిలిందంటూ Dy.CM పవన్ మాట్లాడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. ‘పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు. మూఢ నమ్మకాలతో ప్రజలను కించపరచడం, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అంటూ రుద్దడం సరికాదు. సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో కొబ్బరి చెట్లు కూలాయి. చిత్తశుద్ధి ఉంటే ఉప్పునీటి ముప్పును తప్పించండి’ అని ట్వీట్ చేశారు.


