News December 30, 2024
APలో మరో ఘోరం

AP: అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలంలో దారుణం జరిగింది. ఈ నెల 25న ఆశ్రమ పాఠశాల నుంచి అదృశ్యమైన ఓ బాలికపై ముగ్గురు దుండగులు గ్యాంగ్రేప్కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 28న ఆమె ఆచూకీని పోలీసులు గుర్తించారు. తనకు మాయమాటలు చెప్పి ముగ్గురు అఘాయిత్యం చేశారని ఆమె పోలీసులకు చెప్పింది. ఆమెను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Similar News
News December 1, 2025
ప్రొద్దుటూరు: చిన్నోడే పెద్ద పోరాటం!

ప్రొద్దుటూరుకు చెందిన 6వ తరగతి విద్యార్థి ఎబినేజర్ ధైర్యసాహసాలు మెచ్చుకోవాల్సిందే. కాలువకు రక్షణ గోడలేక తన స్నేహితుడు కిందపడ్డాడని బాలుడు జీర్ణించుకోలేకపోయాడు. ఇలా మరొకరు ఇబ్బంది చెందకూడదని పోరాటానికి దిగాడు. కాలువకు వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి విన్నవించాడు. త్వరగా రక్షణగోడ నిర్మించకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని ఆ కుర్రాడు హెచ్చరించాడు.
News December 1, 2025
ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: CM

TG: ఫ్యూచర్ సిటీ, మెట్రోరైల్ విస్తరణ, RRR, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని CM రేవంత్ హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. అత్యధిక వడ్డీతో ఇచ్చిన లోన్లను రీకన్స్ట్రక్షన్ చేయాలన్నారు. మరో 10L ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై హడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్ అంశాలపైనా వారు చర్చించారు.
News December 1, 2025
‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్’ యాప్

TG: ఆధార్ మాదిరిగా ప్రతి వ్యవసాయ భూమికి ప్రత్యేక ID నంబర్తో కూడిన ‘భూధార్’ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. భూముల యాజమాన్య హక్కుల ఆధారంగా రైతులకు అందించనుంది. ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ ఇప్పటికే ‘mభూధార్’ ప్రత్యేక యాప్ను ప్రారంభించింది. స్థానిక ఎన్నికల అనంతరం 2026 JAN నుంచి ఇవి పంపిణీ అవుతాయి. వీటితో భూ వివాదాల తగ్గుదల, సులభ లావాదేవీలు, డిజిటలైజేషన్, పథకాల సక్రమ అమలుకు అవకాశం ఉంటుంది.


