News June 11, 2024
‘కల్కి’ నుంచి మరో ట్రైలర్ సిద్ధం?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల వారానికి ముందు ఈ ట్రైలర్ రానున్నట్లు సమాచారం. దీని నిడివి 2.30 నిమిషాలు ఉన్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.
Similar News
News December 25, 2024
అరటి పండు తింటున్నారా?
అరటి, యాపిల్ తినే వారిలో ఏ కారణంతోనైనా మరణించే ముప్పు దాదాపు 40 శాతం తక్కువని ఓ అధ్యయనంలో తేలింది. వారంలో 3 నుంచి 6 సార్లు ఈ పండ్లు తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచించారు. అరటిలో పుష్కలంగా ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేస్తుందని తెలిపారు. కడుపు ఉబ్బరం తగ్గించడంతో పాటు శరీరానికి అత్యవసర శక్తి అందిస్తాయని పేర్కొన్నారు.
News December 25, 2024
ఆడపిల్లలకు స్కూటీలు ఏవి రేవంత్?: కవిత
TG: రాష్ట్రంలోని అన్ని వర్గాలను సీఎం రేవంత్ మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనా రేషన్ కార్డులు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. ‘రైతులు పండించే పంటలకు మద్దతు ధర దక్కడం లేదు. రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతు భరోసా రాలేదు. క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాల ఊసే లేదు. మహిళలకు రూ.2500, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు’ ఆమె ఫైర్ అయ్యారు.
News December 25, 2024
వచ్చే నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు: TTD
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్ని వచ్చే నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. వచ్చే నెల 8న ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో 9 కేంద్రాల్లో 91 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక గోవింద మాల భక్తులకు ప్రత్యేకంగా టికెట్లను ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.