News September 26, 2024

ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్

image

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్లతో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ట్వీట్ వైరలవుతోంది. ‘గెలిచేముందు ఒక అవతారం. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం. ఎందుకు మనకీ అయోమయం. ఏది నిజం? జస్ట్‌ ఆస్కింగ్‌?’ అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News January 11, 2026

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ అలర్ట్‌

image

ఈ-కామర్స్ సంస్థలు మరో భారీ సేల్స్‌కు రెడీ అయ్యాయి. అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’ను జనవరి 16 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో SBI క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10% వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ తన రిపబ్లిక్ డే సేల్‌ను జనవరి 17 నుంచి ప్రారంభించనుంది. ప్లస్, బ్లాక్ మెంబర్లకు ముందస్తు యాక్సెస్ ఉంటుంది. ఫోన్లు, TVలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లను ఇస్తున్నాయి.

News January 11, 2026

జనవరి 11: చరిత్రలో ఈరోజు

image

* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్‌ అందుబాటులోకి వచ్చిన రోజు * 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం * 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం * 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు (ఫొటోలో) * 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం

News January 11, 2026

పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ ఏర్పాట్లు

image

TG: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 16 లేన్లలో విజయవాడ వైపు ప్రస్తుతం 8 లేన్లు అందుబాటులో ఉండగా, రద్దీ పెరిగితే వాటిని 10కి పెంచనున్నారు. ఫాస్ట్‌ట్యాగ్ సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రతి లేన్‌లో 2 హ్యాండ్ స్కానర్లు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణకు స్పెషల్ టీమ్‌లు రంగంలోకి దిగాయి.