News October 4, 2024
కొండా సురేఖ కామెంట్స్‌పై RGV మరో ట్వీట్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై డైరెక్టర్ RGV మరోసారి స్పందించారు. ‘సురేఖ గన్ గురిపెట్టింది కేటీఆర్‌కు. కాల్చింది మాత్రం నాగార్జున, నాగచైతన్యను. కానీ క్షమాపణ చెప్పింది సమంతకు. ఐన్‌స్టీన్ కూడా ఈ ఈక్వేషన్‌ను పరిష్కరించలేడేమోనని నాకు డౌట్’ అని సెటైరికల్ ట్వీట్ చేశారు. కాగా RGV అంతకుముందు సమంతను సురేఖ పొగిడారని <<14260907>>కామెంట్<<>> చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 9, 2026
లోన్లపై వడ్డీరేటు తగ్గించిన HDFC

తమ బ్యాంకులో లోన్లు తీసుకున్న వారికి HDFC గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవల RBI రెపో రేట్‌ను తగ్గించడంతో లోన్లపై వడ్డీ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో లోన్ల కాల వ్యవధిని బట్టి వడ్డీ రేటు 8.25శాతం నుంచి 8.55 శాతం మధ్య ఉండనుంది. దీంతో తర్వాతి EMIలు కాస్త తగ్గనున్నాయి. ఇది ఈ నెల 7 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ పేర్కొంది. తగ్గిన వడ్డీ రేట్లను పైన ఫొటోలో చూడవచ్చు.
News January 9, 2026
పుట్టుకతో కుబేర యోగం ఎలా కలుగుతుంది?

జాతక చక్రంలో ధన స్థానమైన 2వ ఇల్లు, లాభ స్థానమైన 11వ ఇల్లు చాలా కీలకం. ఈ 2 స్థానాల అధిపతులు తమ స్వక్షేత్రాల్లో లేదా ఉచ్ఛ స్థితిలో ఉండి, ఒకరినొకరు వీక్షించుకున్నా లేదా కలిసి ఉన్నా కుబేర యోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా గురు, శుక్ర గ్రహాల అనుకూలత ఈ యోగానికి బలాన్ని ఇస్తుంది. లగ్నాధిపతి బలంగా ఉండి ఎనిమిది, పన్నెండో స్థానాలతో శుభ సంబంధం కలిగి ఉన్నప్పుడు కూడా ఈ యోగం ఏర్పడి వ్యక్తిని ధనవంతుడిని చేస్తుంది.
News January 9, 2026
ALERT: ఆ పత్తి విత్తనాలు కొనొద్దు

TG: కేంద్రం అనుమతి లేని HT(Herbicide tolerant) పత్తి విత్తనాలను రాష్ట్రంలో అమ్మకుండా అరికట్టాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ పత్తి రకాన్ని అమెరికాకు చెందిన మోన్సాంటో కంపెనీ అభివృద్ధి చేసింది. అయితే ఫీల్డ్ ట్రయల్స్‌లో ఇవి విఫలమవ్వడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతుందని ఈ విత్తనాల వినియోగానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు. రైతులు వీటిని కొని ఇబ్బందిపడొద్దని మంత్రి సూచించారు.


