News November 21, 2024
ధనుష్‌తో వివాదం వేళ నయనతార మరో ట్వీట్
నెట్‌ఫ్లిక్స్ తనపై రూపొందించిన డాక్యుమెంటరీలో తమ సినిమాల ఫుటేజ్‌ను వాడుకునేందుకు అనుమతినిచ్చిన నిర్మాతలకు నయనతార కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే ఆలస్యం చేయకుండా తనకు NOC ఇచ్చారంటూ చిరంజీవి, షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ సహా పలువురి పేర్లను ఆమె ప్రకటించారు. కాగా ‘నానుమ్ రౌడీ దానే’ మూవీ క్లిప్స్ వాడుకునేందుకు హీరో ధనుష్ NOC ఇవ్వకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేయడంపై ఇటీవల నయన్ ఆగ్రహించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 23, 2024
వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై
AP: వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ మోషేను రాజుకు పంపారు. కాగా కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీలో పనిచేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.
News November 23, 2024
ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. JMM-కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారం చేపట్టడానికి అవసరమైన 41 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. ప్రస్తుతం 51 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి. అయితే ఈనెల 20న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఝార్ఖండ్‌లో కమలం వికసిస్తుందని జోస్యం చెప్పాయి. మై యాక్సిస్ ఇండియా మినహా అన్ని సంస్థలూ NDAకే పట్టం కట్టాయి. కానీ ఇవాళ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
News November 23, 2024
ఒకటి బీజేపీ.. మరొకటి కాంగ్రెస్
రెండు పార్లమెంటు స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో BJP, కాంగ్రెస్ చెరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ 3,42,610 ఓట్ల మెజారిటీతో గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో BJP అభ్యర్థి డాక్టర్ శాంతుక్రావు మరోట్రావ్ హంబర్డే 12,283 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.