News August 2, 2024
రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్

రాజ్ తరుణ్, అతడి మాజీ ప్రేయసి లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని RJ శేఖర్ బాషా, ప్రీతి హైదరాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్యతో తమకు మూడేళ్లుగా పరిచయం ఉందని, డ్రగ్స్ విషయంలో ఇప్పటికీ కాల్స్ చేస్తూ ఇబ్బందులు పెడుతోందని తెలిపారు. కాగా, ప్రీతి ఆరోపణలను లావణ్య ఖండించారు. ఆమెకే డ్రగ్స్, గంజాయి అలవాటు ఉందని చెప్పారు.
Similar News
News November 18, 2025
జైల్లో మొహియుద్దీన్పై దాడి!

టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టై అహ్మదాబాద్ సబర్మతీ జైల్లో ఉన్న డా.అహ్మద్ మొహియుద్దీన్పై దాడి జరిగింది. తోటి ఖైదీలు అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్ను పోలీసులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల వ్యర్థాలతో ‘రెసిన్’ అనే విషాన్ని తయారు చేసి వేలాది మందిని చంపాలని మొహియుద్దీన్ ప్రయత్నించాడు. ఈక్రమంలోనే HYD రాజేంద్రనగర్‌లో గుజరాత్ ATS అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.
News November 18, 2025
హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై సంధ్య కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎవరి అనుమతితో కూల్చివేశారని హైడ్రాను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఉత్తర్వులను ఎందుకు పట్టించుకోలేదని సీరియస్ అయ్యింది. ఈ కేసులో తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
News November 18, 2025
అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

హరియాణా ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.


