News January 24, 2025

సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో ట్విస్ట్

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్నది తన కొడుకు కాదని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం తండ్రి రుహుల్ అమిన్ తెలిపారు. పోలీసులు తన కుమారుడిపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. తన కుమారుడు ఎప్పుడూ పొట్టి జుట్టుతోనే ఉంటాడని తెలిపారు. షేక్ హసీనా హయాంలో బంగ్లాదేశ్‌లో చాలా హత్యలు జరిగాయని, వాటిని చూసి భయపడి అతడు భారత్ వెళ్లాడని వివరించారు.

Similar News

News February 4, 2026

IND vs SA.. లైవ్ ఇక్కడ చూడండి

image

T20WC వార్మప్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాపై టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. గత వరల్డ్ కప్ ఫైనల్లో తలపడిన ఇరు జట్లు మళ్లీ ఈ టోర్నీలో వార్మప్ మ్యాచ్‌లో ఢీకొంటున్నాయి. 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడొచ్చు.
IND: అభిషేక్, ఇషాన్, సూర్యకుమార్(C), తిలక్, శాంసన్, పాండ్య, రింకూ, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్.

News February 4, 2026

CUET UG.. మరికొన్ని గంటలే ఛాన్స్

image

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG-2026) రిజిస్ట్రేషన్ గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. రా.11.50 వరకు <>cuet.nta.nic.in<<>> సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈనెల 7వరకు ఫీజు చెల్లింపు, ఈ నెల 9 నుంచి 11 వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. మే 11 నుంచి 31 మధ్య పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా సెంట్రల్, స్టేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాలకు NTA ఈ ఎగ్జామ్ నిర్వహిస్తోంది.

News February 4, 2026

ఎంత సంపద ఉన్నా.. ఆనందం లేదా?

image

సంపద ఎంతున్నా దాన్ని అనుభవించలేకపోతే అందుకు పండితులు కొన్ని పరిహారాలు సూచిస్తున్నారు. శనివారం శెనగలు పంచడం, శివలింగానికి బిల్వార్చన చేయడం మంచిదంటున్నారు. నిత్యం ధ్యానం చేయాలంటున్నారు. ‘అమ్మవారికి పసుపు చీర సమర్పించాలి. శుక్రవారం ధ్వజస్తంభం వద్ద మినప్పండి దీపం వెలిగించాలి. ఇంటికి వేపాకుల దండ కట్టడం వల్ల దిష్టి తొలగి ఆస్తులు అనుభవించే యోగం కలుగుతుంది. దానాలు శీఘ్ర ఫలితాలు ఇస్తాయి’ అంటున్నారు.