News May 10, 2024

మరోసారి VDK-రష్మిక కాంబోలో మూవీ?

image

గీత గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ-రష్మిక వెండి తెరపై మెరవనున్నట్లు సమాచారం. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో రౌడీ హీరో చేస్తోన్న మూవీలో నేషనల్ క్రష్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. 18వ శతాబ్దంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా పీరియాడిక్ డ్రామాగా సినిమా ఉంటుందని తెలుస్తోంది. విజయ్ బర్త్‌డే సందర్భంగా ఇటీవల మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News October 23, 2025

మెటాలో 600 ఉద్యోగులపై వేటు!

image

మెటా కంపెనీ AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు US మీడియా పేర్కొంది. దీంతో ఫేస్‌బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్, ప్రొడక్ట్ ఏఐ, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ప్రభావం పడనుంది. కాగా ఈ తొలగింపుతో అనవసర విధులు తగ్గి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ వాంగ్ తెలిపారు. అయితే కొత్త నియామకాలపై దీని ఎఫెక్ట్ ఉండదని తెలుస్తోంది.

News October 23, 2025

ఓటీటీలోకి వచ్చేసిన ‘OG’

image

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.308 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.

News October 23, 2025

మేడారం జాతరకు భారీగా ఏర్పాట్లు

image

TG: వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో జరిగే <<17462157>>మేడారం<<>> జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జాతర జరిగే ప్రదేశాన్ని 8 జోన్లు, 31 సెక్టార్లుగా విభజించనున్నట్లు అధికారులు తెలిపారు. 1,050 ఎకరాల్లో 49 పార్కింగ్ స్థలాలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా 24 శాశ్వత, 20 తాత్కాలిక మొబైల్ టవర్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. 12 వేల మంది పోలీసులు జాతరలో విధులు నిర్వహిస్తారని సమాచారం.