News August 1, 2024
పశ్చిమాసియాలో మరో యుద్ధం?

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. తమ గడ్డపై హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయెల్ చంపడంతో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడి చేయాలని ఆ ప్రభుత్వం తమ సైన్యాన్ని తాజాగా ఆదేశించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. తాజాగా హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ దైఫ్ని కూడా ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Similar News
News December 6, 2025
నిజామాబాద్: 3వ రోజు 2,975 నామినేషన్లు

NZB జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం 2,975 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 608 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 2,367 మంది నామినేషన్లు వేశారు. 3 రోజుల్లో SPలకు 1,077, WMలకు 4,021 నామినేషన్లు వచ్చాయి.
News December 6, 2025
సిరి సంపదలను కలిగించే ‘వ్యూహ లక్ష్మి’

శ్రీవారి వక్ష స్థలంలో ‘వ్యూహ లక్ష్మి’ కొలువై ఉంటారు. ఈ అమ్మవారే భక్తుల కోర్కెలు విని శ్రీవారికి చేరవేరుస్తారని పండితులు చెబుతారు. తిరుమల వెళ్లి వ్యూహ లక్ష్మిని దర్శించుకున్నా, ఇంట్లో వ్యూహలక్ష్మిని పూజించినా అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలు లభిస్తాయని నమ్మకం. శ్రీవారి మూలవిరాట్టుపై అమ్మవారు ఎప్పుడూ పసుపు అచ్చుతో కప్పబడి ఉంటారు. ఆ పసుపును మనం ప్రసాదంగా పొందవచ్చు. ☞ అదెలాగో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News December 6, 2025
కొక్కెర వ్యాధి – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కోళ్ల షెడ్డును శుభ్రంగా ఉంచి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. సంతలో కొన్న పెట్టలను, పుంజులను టీకాలు వేయకుండా షెడ్డులో కోళ్లతో కలిపి ఉంచకూడదు. పెద్ద, చిన్న కోళ్లను వేరువేరుగా ఉంచాలి. వెటర్నరీ నిపుణుల సూచనలతో కోడిపిల్లలు పుట్టిన తొలి వారంలోనే F1(RD)/Lasota టీకా మందు కంటిలో/ముక్కులో వేస్తే 6 వారాల వరకు ఈ కొక్కెర వ్యాధి రాదు. కోళ్లకు ఆరు వారాల వయసులో R2B (R.D.) వ్యాక్సిన్ 0.5 ml s/c వేయాలి.


