News December 8, 2024
తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో విజయం

ప్రో కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ ఖాతాలో మరో విజయం చేరింది. బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచులో 34-32 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తెలుగు టైటాన్స్‌లో విజయ్ 11 పాయింట్లు సాధించారు. ఈ గెలుపుతో TT ఖాతాలో 10 విజయాలు చేరాయి. దీంతో నాలుగో స్థానానికి చేరింది.
Similar News
News January 16, 2026
క్షణాల్లో మెరిసే అందం మీ సొంతం

ఏదైనా ఫంక్షన్లు, పెళ్లిల్లు, పార్టీలు ఉంటే అందంగా కనిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడితే ఇన్‌స్టంట్ గ్లో వస్తుందంటున్నారు నిపుణులు. * బాగా పండిన అరటిపండు, తేనె, శనగపిండి, కాఫీ పౌడర్ కలిపి చర్మానికి అప్లై చేసి, 10నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. -ఓట్స్ గంటపాటు నానబెట్టి తేనె కలిపి పేస్ట్ చేసి దాన్ని చర్మానికి అప్లై చేసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
News January 16, 2026
కనుమ రోజున పశువులను ఎలా పూజించాలి?

పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటేనే రైతుకి ఉత్సాహం. పంట చేతికి రావడంలో వాటి పాత్ర కీలకం. తమకు సుఖ,సంతోషాలను అందించడానికి అహర్నిశలు కష్టపడే పశువులను రైతులు మరచిపోరు. తమకు జీవనాధారమైన మూగజీవాల పట్ల కృతజ్ఞతగా అన్నదాతలు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. ఈ రోజు పశువులను ఎలా పూజిస్తే వ్యవసాయం మరింత సుభిక్షంగా ఉంటుందో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ <<>>క్లిక్ చేయండి.
News January 16, 2026
T20 వరల్డ్‌కప్‌లో సుందర్ ఆడటం కష్టమే!

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం నుంచి ఇప్పటికీ కోలుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌తో చివరి రెండు వన్డేలకు దూరమైన సుందర్, ఇప్పుడు టీ20లకూ అందుబాటులో లేరు. ఈ విషయాన్ని ఇటీవల బీసీసీఐ తెలిపింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే T20 వరల్డ్‌కప్‌కు కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించడం కష్టమని నివేదికలు చెబుతున్నాయి. దీంతో జట్టులో ఆయన స్థానం అనుమానంగానే మారింది.


